ETV Bharat / sports

ఐపీఎల్: హ్యాట్రిక్ కోసం ఒకరు.. ఉనికి కోసం మరొకరు! - rajasthan royals kolkata preview match

నేడు దుబాయ్​ వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో కోల్​కతా నైట్​ రైడర్స్​​ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హ్యాట్రిక్​ విజయం సాధించాలని రాజస్థాన్​, గెలవాలనే లక్ష్యంతో కోల్​కతా పట్టుదలతో బరిలో దిగనున్నాయి. మరి ఈ మ్యాచ్​లో విజయం ఎవరివైపు నిలుస్తుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Rajasthan Royals vs Kolkata knight riders
రాజస్థాన్​ X కోల్​కతా
author img

By

Published : Sep 30, 2020, 5:35 AM IST

తొలి రెండు మ్యాచ్​ల్లో అద్భుత విజయం సాధించింది రాజస్థాన్​ రాయల్స్​. తొలి మ్యాచ్​లో ముంబయిపై ఓడినా.. పుంజుకుని సన్​రైజర్స్​ హైదరాబాద్​పై గెలిచింది కోల్​కతా నైట్​ రైడర్స్​. ఇప్పుడీ రెండు జట్లు నేడు (బుధవారం) హోరాహోరీగా తలపడనున్నాయి. హ్యాట్రిక్​ విజయం అందుకోవాలనే లక్ష్యంతో​ రాజస్థాన్​, మరోసారి సత్తా చాటాలని దినేశ్​ కార్తీక్​ సేన పట్టుదలతో ఉన్నాయి. కచ్చితమైన వ్యూహాలు అమలు చేసి, పాయింట్లు పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

రాజస్థాన్​ రాయల్స్​

ఈ ఐపీఎల్​ అభిమానులకు అసలైన మజా రాజస్థాన్ రాయల్స్ బరిలో దిగడం నుంచే ప్రారంభమైంది. తొలి మ్యాచ్​లో అద్భుత స్కోరు చేసి ధోనీ సేనను మట్టికరిపించింది. శాంసన్‌(74) మెరుపులు, స్మిత్(69) మాస్టర్ స్ట్రోక్​తో ఈ సీజన్​లో 200కు పైగా స్కోరు చేసిన తొలి జట్టుగా నిలిచింది రాజస్థాన్​. ఇదే జోష్​తో పంజాబ్​ జట్టును చతికిలపడేలా చేసింది. మరోసారి సంజూ శాంసన్​(85), స్మిత్​(50) అర్ధ శతకాలతో మెరిశారు. అయితే ఈ మ్యాచ్​ చివర్లో రాహుల్​ తెవాతియా ధనాధన్​ ఇన్నింగ్స్ అందరీ దృష్టిని ఆకర్షించింది. దీంతో అతడు హీరోగా మారిపోయాడు. మొత్తంగా రెండు మ్యాచ్​ల్లోనూ ఏమాత్రం జోరు తగ్గకుండా ప్రత్యర్థులపై విరుచుకుపడింది రాజస్థాన్​. ప్రస్తుతం కోల్​కతాతో జరిగే మ్యాచ్​లోనూ ఈ ఆటగాళ్లే రాయల్స్​​కు బలం. వీరు ఇదే జోరును కొనసాగిస్తే హ్యాట్రిక్​ విజయాన్ని అందుకోవడం ఖాయం.

కోల్​కతా నైట్​ రైడర్స్​

కోల్​కతా నైట్​ రైడర్స్​.. తొలి మ్యాచ్​లోనే ముంబయిపై ఓడినా.. పుంజుకుని సన్​రైజర్స్​ హైదరాబాద్​పై విజయాన్ని అందుకుంది. అయితే రెండు మ్యాచుల్లోనూ స్కోరు తక్కువే చేసింది. తొలి మ్యాచ్​లో సారథి​ దినేశ్​ కార్తీక్, నితీశ్​ రానా జట్టును గెలిపించడానికి విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్​ చివర్లో కమిన్స్​​ (33, 12 బంతుల్లో; 1×4, 4×6) విరుచుకుపడ్డా.. అప్పటికే మ్యాచ్​ చేజారిపోయింది. ఆ తర్వాత మ్యాచ్​లో సన్​రైజర్స్​ పేలవమైన ప్రదర్శన చేయడం వల్ల అదృష్టం కొద్దీ కోల్​కతా గెలిచింది. లేదంటే మళ్లీ ఓటమిని మూటగట్టుకోవాల్సి ఉండేది. శుభమన్​ గిల్​(70), ఇయాన్​ మోర్గాన్​, నితీశ్​ రానా తప్ప మిగితా వారు విఫలమయ్యారు. మరి ఈ మ్యాచ్​లోనైనా కచ్చితమైన వ్యూహాలతో బరిలో దిగితే తప్ప గెలవడం కష్టమనే చెప్పాలి.

జట్ల అంచనాలు

కోల్​కతా

సునీల్ నరైన్, శుభ్​మన్ గిల్, దినేశ్ కార్తిక్(కెప్టెన్), నితీశ్ రానా, మోర్గాన్, ఆండ్రూ రసెల్, కమిన్స్, కమలేశ్ నాగర్​కోటి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి

రాజస్థాన్

జాస్ బట్లర్, స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన్ ఉతప్ప, రాహుల్ తెవాతియా, రియాన్ పరాగ్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, అంకిత్ రాజ్​పుత్

ఇదీ చూడండి ఐపీఎల్​ 13 : కోహ్లీని వెంటాడుతోన్న దురదృష్టం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.