ETV Bharat / sports

ఐపీఎల్: చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ఉతప్ప

ఐపీఎల్​లో కీలక ఆటగాడు రాబిన్ ఉతప్పను రాజస్థాన్​ రాయల్స్​ జట్టు వదులుకుంది. ఇటీవలే జరిగిన ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా రాబిన్​ను చెన్నై సూపర్​కింగ్స్​ టీమ్​ దక్కించుకుంది.

IPL 2021: Uthappa traded from Rajasthan Royals to Chennai Super Kings in all-cash deal
ఐపీఎల్: చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ఉతప్ప
author img

By

Published : Jan 22, 2021, 8:03 AM IST

కీలక ఆటగాడు రాబిన్​ ఉతప్పను రాజస్థాన్​ రాయల్స్​ జట్టు వదులుకుంది. ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా అతణ్ని చెన్నై సూపర్​కింగ్స్​ టీమ్​ దక్కించుకుంది. ఇప్పటిదాకా 189 ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడిన ఉతప్ప.. గత సీజన్లో పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో రాజస్థాన్​ జట్టు అతణ్ని వదులుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సయ్యద్​ ముస్తాక్​ అలీలో కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాబిన్​ ఓ మోస్తరుగా ఆడుతున్నాడు. కానీ, అతడి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎస్​కే ఉతప్పను కొనుక్కుంది. ఇటీవలే మురళీ విజయ్​, కేదార్​ జాదవ్​తో పాటు విదేశీ ఆటగాడు షేన్ వాట్సన్​నూ చెన్నై వదులుకుంది.

ఇదీ చూడండి: 'కెప్టెన్​గా స్మిత్​ ఓకే.. మరి వార్నర్​కు ఎందుకీ అన్యాయం?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.