ETV Bharat / sports

డివిలియర్స్ మాములోడు కాదు: కోహ్లీ - Impactful player

సహచర ఆటగాడు డివిలియర్స్​ ప్రదర్శనను మెచ్చుకున్న బెంగళూరు కెప్టెన్ కోహ్లీ.. అతడిలాంటి ఆటగాడు ఉంటే జట్లు, గెలుపుపై ఆశలు అస్సలు కోల్పోవని అన్నాడు.

Virat Kohli rates ABD as RCB's most impactful player
స్టార్ ఆటగాడు డివిలియర్స్
author img

By

Published : Oct 18, 2020, 7:17 AM IST

మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్​పై, ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. లీగ్​లో అత్యంత ప్రభావవంతమైన ఆటగాడు అతడని అన్నాడు. ఏబీ లాంటి బ్యాట్స్​మన్ ఉంటే జట్లు ధీమాగా ఉండొచ్చని తెలిపాడు.

"ఏబీ డివిలియర్స్ ఐపీఎల్​లో అత్యంత ప్రభావవంత ఆటగాడు. ఎప్పుడైనా సరే పరిస్థితులను అంచనా వేసి అందుకు తగ్గట్లు ఆడతాడు. కేవలం అతడిలాంటి ఆటగాడు ఉండటం వల్లే జట్లు ఎలాంటి స్థితిలోనూ ఆశలు కోల్పోవు" -కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్

శనివారం జరిగిన ఈ మ్యాచ్​లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన డివిలియర్స్.. గెలుపు తమదే అనుకున్న రాజస్థాన్​కు నిరాశ మిగిల్చాడు. ఏబీ 22 బంతుల్లో 55 పరుగులు (ఆరు సిక్సులు, ఫోర్)చేయడం వల్ల మరో రెండు బంతులు మిగిలుండగానే బెంగళూరు విజయం సాధించింది.

simon katich
ఆర్సీబీ కోచ్ సైమన్ కటిచ్

తప్పు తెలుసుకున్నాం: కటిచ్

"అవును అతడో(డివిలియర్స్) అద్భుత బ్యాట్స్​మన్. అందుకే దిగ్గజాల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏబీ ఈరోజు సరైన స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. గత మ్యాచ్​లో మేం చేసిన తప్పు తెలుసుకున్నాం. అతడి వల్లే రాజస్థాన్​పై విజయం సాధించాం. ఇతర ప్లేయర్ల నుంచి సహకరం అందకపోయినా సరే, డివిలియర్స్ ఒంటిచేత్తో మ్యాచ్​ను గెలిపించాడు" అని ఆర్సీబీ కోచ్ సైమన్ కటిచ్ చెప్పాడు.

ఇది చదవండి: డివిలియర్స్ మెరుపు ఇన్నింగ్స్.. బెంగళూరు ఘనవిజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.