మంగళవారం దుబాయ్ వేదికగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు తలపడనున్నాయి. సీఎస్కే టోర్నీలో ఇప్పటివరకు సరైన ప్రదర్శన చేయలేకపోయింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే గెలుపొందిన ధోనీసేన పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిని గెలుపొంది.. ఐదో స్థానంలో ఉంది.
గెలుపు కోసం పోరాటం
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై పరాజయం పొందింది. ఈ మ్యాచ్ చివర్లో రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. మరోవైపు శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎలగైనా గెలిచి టోర్నీలో నిలదొక్కుకోవాలనే ప్రయత్నాన్ని ఇరుజట్లు చేస్తున్నాయి.
బ్యాటింగ్ తీరు మారాలి
గతమ్యాచ్‌లో క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే వెనుదిరిగారు. అంబటి రాయుడు ఒక్కడే నిలకడగా రాణించాడు. మరోవైపు ఈ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతంతమాత్రంగానే ఉన్నారు. బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, సామ్ కరన్‌తో పాటు స్పిన్నర్ కర్ణ్ శర్మ రాణింస్తుండటం వల్ల సీఎస్కేకు బౌలింగ్ లైనప్‌లో ఎలాంటి ఢోకా లేదు. కానీ, బ్యాటింగ్ తీరు చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
మెరుగ్గానే ఉంది..కానీ!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరికి మద్దతుగా మిడిల్ ఆర్డర్లో మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్తో పాటు యువ బ్యాట్స్‌మన్ ప్రియమ్ గార్గ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలింగ్ లైనప్.. యార్కర్ స్పెషలిస్టు నటరాజన్, స్పినర్ రషీద్ ఖాన్‌తో కట్టుదిట్టంగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపొవచ్చు.
చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది.
జట్లు:
చెన్నై సూపర్‌కింగ్స్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మురళీ విజయ్, అంబటి రాయుడు, ఫాఫ్ డు ప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, లుంగీ ఎన్గిడి, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, ఇమ్రాన్ తాహిర్, జోష్ హిట్జ్, శార్దుల్ ఠాకూర్, సామ్ కరన్, ఎన్ జగదీశన్, కెఎమ్ ఆసిఫ్, మోను కుమార్, ఆర్ సాయి కిషోర్, రుతురాజ్ గైక్వాడ్, కర్న్ శర్మ.
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, శ్రీవాత్సవ గోస్వామి, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, వృద్దిమాన్ సాహా, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్, సంజయ్ యాదవ్, ఫాబియన్ అలెన్, పృథ్వీ రాజ్ యర్రా, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్లేక్, టి నటరాజన్, బాసిల్ తంపి.