దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి చవిచూసింది. అన్ని విభాగాల్లోనూ విఫలమై ఈ లీగ్‌లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. బౌలింగ్‌లో కాస్త పర్వాలేదనిపించినా.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచారు సీఎస్కే ఆటగాళ్లు. ఈ క్రమంలో వారి బ్యాటింగ్ టెస్టు మ్యాచ్‌లా సాగిందంటూ విమర్శలూ వచ్చాయి. చెన్నై బ్యాటింగ్‌పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు.
"సీఎస్కే బ్యాట్స్‌మన్ తడబడ్డారు. తదుపరి మ్యాచ్‌లో మెరుగ్గా ఆడటానికి వారు గ్లూకోజ్ తీసుకుని రావాలేమో" అంటూ ట్వీట్ చేశాడు సెహ్వాగ్.
-
Chennai ke batsman simply not getting going. Glucose chadwaake aana padega next match se batting karne.
— Virender Sehwag (@virendersehwag) September 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chennai ke batsman simply not getting going. Glucose chadwaake aana padega next match se batting karne.
— Virender Sehwag (@virendersehwag) September 26, 2020Chennai ke batsman simply not getting going. Glucose chadwaake aana padega next match se batting karne.
— Virender Sehwag (@virendersehwag) September 26, 2020
అయితే ఈ మ్యాచ్‌లో ఓటమికి బ్యాటింగ్ విభాగంలో సమతూకం లేకపోవడమే కారణమన్నాడు సీఎస్కే సారథి ధోనీ. రాయుడు లేకపోవడం వల్ల ఓడిపోయామని తెలిపాడు.
"రాయుడు లేకపోవడం వల్ల చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. బ్యాటింగ్ ఆర్డర్లో సమతూకం రావడం లేదు. ఇది మాకు మంచి మ్యాచ్‌కాదు. తేమ లేనప్పటికీ వికెట్ నెమ్మదించింది. బ్యాటింగ్ విభాగంలో కసి తగ్గడం మమ్మల్ని బాధిస్తోంది. దూకుడైన ఆరంభం లేకపోవడం వల్ల రన్‌రేట్‌తో పాటు ఒత్తిడి పెరుగుతోంది. స్పష్టమైన లక్ష్యం, కూర్పుతో మేం బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే జట్టు సమతూకం మెరుగవ్వొచ్చు. అలా జరిగితే ఒక అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకూ వీలుంటుంది" అని తెలిపాడు ధోనీ.