ETV Bharat / sports

ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడిన కేకేఆర్​ - ఆర్సీబీ స్క్వాడ్ టుడే

IPL 2020: RCB vs KKR match updates
టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆర్సీబీ
author img

By

Published : Oct 12, 2020, 7:19 PM IST

Updated : Oct 12, 2020, 11:19 PM IST

23:12 October 12

82 పరుగుల తేడాతో ఘనవిజయం

195 పరుగులే లక్ష్యంగా బరిలో దిగిన కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 112 స్కోరు చేసింది. ఫలితంగా 82 పరుగులు భారీ తేడాతో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లు క్రిస్​ మోరిస్​, వాషింగ్టన్​ సుందర్​ చెరో రెండు వికెట్లు సాధించి జట్టు గెలుపొందడానికి సహకరించారు. కేకేఆర్​ బ్యాట్స్​మెన్​లో శుభ్​మన్​ గిల్​ (34) తప్ప మిగిలిన వారెవ్వరూ రాణించలేకపోయారు. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్​ల్లో ఐదింటిలో గెలుపొందిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడోస్థానానికి చేరుకుంది.

23:08 October 12

నాగర్​కోటి ఔట్​

ఆర్సీబీ బౌలర్​ క్రిస్​ మోరిస్​ వేసిన బంతికి కేకేఆర్​ బ్యాట్స్​మన్​ కమలేశ్​ నాగర్​కోటి (4) బౌల్డ్​గా వెనుదిరిగాడు.

23:02 October 12

ఓటమికి చేరువలో కోల్​కతా

18 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది కేకేఆర్​ జట్టు. కోల్​కతా గెలుపు కోసం 12 బంతుల్లో 91 రన్స్​ చేయాల్సిఉంది. 

22:56 October 12

రాహుల్ త్రిపాఠి ఔట్​

ఆర్సీబీ బౌలర్​ మహ్మద్​ సిరాజ్​ వేసిన బంతిని బౌండరీగా మలచబోయిన కోల్​కతా బ్యాట్స్​మన్​ రాహుల్​ త్రిపాఠి (16).. క్రిస్​ మోరిస్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు.

22:53 October 12

16 ఓవర్లకు కేకేఆర్​ 95/7

16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 95 పరుగులు చేసి ఏడు వికెట్లు నష్టపోయింది కోల్​కతా నైట్​రైడర్స్​. ప్రస్తుతం క్రీజ్​లో రాహుల్​ త్రిపాఠి (12), కమలేశ్​ నాగర్​కోటి (1) ఉన్నారు. కేకేఆర్​ గెలుపు కోసం 24 బంతుల్లో 100 రన్స్​ చేయాల్సిఉంది. 

22:53 October 12

22:47 October 12

కమ్మిన్స్​ ఔట్​

క్రిస్​ మోరిస్​ బౌలింగ్​లో భారీషాట్​కు ప్రయత్నించబోయిన కేకేఆర్​ బ్యాట్స్​మన్​ పాట్​ కమ్మిన్స్​ (1) పడిక్కల్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

22:41 October 12

రస్సెల్​ ఔట్​

ఆర్సీబీ బౌలర్​ ఉడానా వేసిన బంతిని భారీషాట్​గా మలచబోయిన కేకేఆర్​ బ్యాట్స్​మన్​ ఆండ్రూ రస్సెల్​ (16).. మహ్మద్​ సిరాజ్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లకు కోల్​కతా ఆరు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రాహుల్​ త్రిపాఠి (6), పాట్ కమ్మిన్స్​ (0) ఉన్నారు. నైట్​రైడర్స్ గెలుపు కోసం 36 బంతుల్లో 109 రన్స్​ చేయాల్సిఉంది.  

22:30 October 12

12 ఓవర్లకు కేకేఆర్​ 69/5

12 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయిన కోల్​కతా నైట్​రైడర్స్​.. 69 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రాహుల్​ త్రిపాఠి (4), ఆండ్రూ రస్సెల్​ (1) ఉన్నారు. కేకేఆర్​ గెలుపు కోసం 48 బంతుల్లో 126 రన్స్​ చేయాల్సిఉంది. 

22:26 October 12

మోర్గాన్​ ఔట్​

వాషింగ్టన్​ సుందర్​ వేసిన బంతిని కోల్​కతా బ్యాట్స్​మన్​ ఇయాన్​ మోర్గాన్​ (8) బౌండరీగా తరలించబోయి ఫైన్​లెగ్​ ఫీల్డర్​ ఉడానాకు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

22:21 October 12

దినేశ్ కార్తిక్​ ఔట్​

యుజ్వేంద్ర చాహల్​ వేసిన బౌలింగ్​లో కేకేఆర్​ కెప్టెన్​ దినేశ్​ కార్తిక్​ (1) బౌల్డ్​గా వెనుదిరిగాడు.

22:19 October 12

10 ఓవర్లకు కేకేఆర్​ 61/3

పది ఓవర్లు పూర్తయ్యే సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన కోల్​కతా నైట్​రైడర్స్​.. 61 పరుగులు చేసింది. కేకేఆర్​ గెలుపు కోసం 59 బంతుల్లో 134 రన్స్​ చేయాల్సిఉంది. 

22:18 October 12

శుభ్​మన్​ గిల్​ ఔట్​

కోల్​కతా బ్యాట్స్​మన్​ శుభ్​మన్​ గిల్​(34) పరుగు​ తీసే క్రమంలో రనౌట్​గా వెనుదిరిగాడు.

22:07 October 12

నితీశ్​రానా ఔట్​

ఆర్సీబీ బౌలర్​ వాషింగ్టన్​ సుందర్​ వేసిన బంతికి కేకేఆర్​ బ్యాట్స్​మన్​ నితీశ్​ రానా (9) బౌల్డ్​గా వెనుదిరిగాడు. 8 ఓవర్లకు కోల్​కతా రెండు వికెట్లు నష్టపోయి 51 పరుగులు చేసింది.

21:57 October 12

6 ఓవర్లకు కోల్​కతా 43/1

ఆరు ఓవర్లకు కోల్​కతా నైట్​రైడర్స్ ఒక వికెట్​ నష్టపోయి 43 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో శుభ్​మన్​ గిల్​ (26), నితీశ్ రానా (6) ఉన్నారు. 

21:52 October 12

బాటన్​ ఔట్​...

కేకేఆర్​ ఓపెనర్​ టామ్​ బాటన్​ 8పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సైనీ బౌలింగ్​లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆ జట్టు 5ఓవర్లకు ఒక వికెట్​ నష్టానికి 39పరుగులు చేసింది.

21:38 October 12

నిలకడగా కేకేఆర్​ బ్యాటింగ్​...

195 పరుగుల లక్ష్యఛేదనతో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన కేకేఆర్​.. నిలకడగా బ్యాటింగ్​ చేస్తోంది. 2ఓవర్లకు వికెట్​ నష్టపోకుండా 12 పరుగులు చేసింది.

21:15 October 12

కోల్​కతా లక్ష్యం 195

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆరంభంలో ఆరోన్​ ఫించ్​ (47) ఆకట్టుకున్నా.. హాఫ్​ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ బరిలో దిగిన ఏబీ డివిలియర్స్​.. కెప్టెన్​ కోహ్లీతో కలిసి విధ్వంసకర బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. కేవలం 33 బంతుల్లో 73 రన్స్​ చేసి ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు మిస్టర్​ 360. 

21:02 October 12

బౌండరీల మోత

ఆర్సీబీ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్​ విధ్వంసకర బ్యాటింగ్​ చేస్తున్నాడు. వరుస సిక్సర్లతో 23 బంతుల్లోనే అర్థశతకాన్ని నమోదు చేసుకున్నాడు. 18 ఓవర్లు పూర్తయ్యే సమయానికి రెండు వికెట్ల నష్టపోయిన కోహ్లీసేన 165 పరుగులు చేసింది. విరాట్​ కోహ్లీ (21), ఏబీ డివిలియర్స్​ (57) క్రీజ్​లో ఉన్నారు.

20:50 October 12

16 ఓవర్లకు బెంగళూరు 129/2

16 ఓవర్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు రెండు వికెట్లు​ నష్టపోయి 129 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో విరాట్​ కోహ్లీ​(20), ఏబీ డివిలియర్స్​(26) ఉన్నారు.

20:41 October 12

దూకుడు పెంచిన ఆర్సీబీ

14 ఓవర్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు రెండు వికెట్లు​ నష్టపోయి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో విరాట్​ కోహ్లీ​(17), ఏబీ డివిలియర్స్​(7) ఉన్నారు.

20:32 October 12

ఆరోన్​ ఫించ్​ ఔట్​

కోల్​కతా నైట్​రైడర్స్​ బౌలర్​ ప్రసిద్​ కృష్ణ వేసిన బంతికి ఆర్సీబీ బ్యాట్స్​మన్​ ఆరోన్​ ఫించ్​ (47) బౌల్డ్​గా వెనుదిరిగాడు.

20:30 October 12

12 ఓవర్లకు ఆర్సీబీ 90\1

12 ఓవర్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఒక వికెట్​ నష్టపోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఆరోన్​ ఫించ్​ (43), విరాట్​ కోహ్లీ​(11) ఉన్నారు.

20:22 October 12

10 ఓవర్లకు ఆర్సీబీ 78\1

పది ఓవర్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఒక వికెట్​ నష్టపోయి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఆరోన్​ ఫించ్​ (36), విరాట్​ కోహ్లీ​(6) ఉన్నారు.

20:13 October 12

8 ఓవర్లకు ఆర్సీబీ 69\1

8 ఓవర్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఒక వికెట్​ నష్టపోయి 69 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఆరోన్​ ఫించ్​ (33), విరాట్​ కోహ్లీ​(1) ఉన్నారు.

20:08 October 12

పడిక్కల్​ ఔట్​

ఆరంభం నుంచి బౌండరీలతో అదరగొడుతున్న ఆర్సీబీ ఓపెనర్ల భాగస్వామ్యానికి బ్రేక్​ పడింది. కోల్​కతా బౌలర్​ ఆండ్రూ రస్సెల్​ వేసిన బంతికి బెంగళూరు బ్యాట్స్​మన్​ దేవదత్​ పడిక్కల్​(32) బౌల్డ్​గా వెనుదిరిగాడు.

19:56 October 12

6 ఓవర్లకు ఆర్సీబీ 47\0

ఆరు ఓవర్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు వికెట్​ కోల్పోకుండా 47 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఆరోన్​ ఫించ్​ (23), దేవ్​దత్​ పడిక్కల్​(23) ఉన్నారు.

19:47 October 12

4 ఓవర్లకు ఆర్సీబీ 37\0

నాలుగు ఓవర్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు వికెట్​ కోల్పోకుండా 37 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఆరోన్​ ఫించ్​ (16), దేవ్​దత్​ పడిక్కల్​(21) ఉన్నారు.

19:39 October 12

2 ఓవర్లకు ఆర్సీబీ 19\0

ఇన్నింగ్స్​ ప్రారంభమైన రెండో బంతికే బౌండరీ కొట్టి శుభారంభాన్ని ఇచ్చాడు బెంగళూరు ఓపెనర్​ ఆరోన్​ ఫించ్​. రెండు ఓవర్లు పూర్తయ్యే సమయానికి రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు వికెట్​ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఆరోన్​ ఫించ్​ (15), దేవ్​దత్​ పడిక్కల్​(4) ఉన్నారు.

19:13 October 12

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆర్సీబీ

టాస్​ గెలిచిన రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్: రాహుల్ త్రిపాఠి, శుభ్​మన్​ గిల్, టామ్ బాంటన్, నితీశ్​ రానా, ఇయాన్ మోర్గాన్, దినేశ్​ కార్తీక్ (కెప్టెన్​, వికెట్​ కీపర్​), ఆండ్రూ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేశ్​ నాగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్​, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్​ కీపర్​), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉడానా, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.

18:37 October 12

ఐదో విజయం కోసం ఇరుజట్ల పోరాటం

ఐపీఎల్​లో మరో సరవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా నేడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్​తో టోర్నీలో మిడ్​-సీజన్​ ప్రారంభమవుతుంది. గత మ్యాచ్​ల్లో విజయం సాధించిన ఇరుజట్లు మరో గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు ఆరు మ్యాచ్​లు ఆడిన ఈ రెండు జట్లు నాలుగింటిలో విజయాలను అందుకున్నాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం కేకేఆర్​ మూడోస్థానంలో ఉండగా.. ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్​ను ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్​ అవకాశాలను పదిలం చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.  

Last Updated : Oct 12, 2020, 11:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.