ETV Bharat / sports

రబాడ దగ్గరకు మళ్లీ పర్పుల్ క్యాప్.. ఆరెంజ్ రేసులో ధావన్ - రాహుల్ ఆరెంజ్ క్యాప్

ఐపీఎల్ ప్రస్తుత సీజన్​లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ పోటీదారుల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. అత్యధిక పరుగులు సాధించిన కేఎల్ రాహుల్ వద్ద ఆరెంజ్, అత్యధిక వికెట్లు పడగొట్టిన రబాడ వద్ద పర్పుల్ క్యాప్ ఉన్నాయి. మంగళవారం జరిగే ఫైనల్ తర్వాత దీనిపై మరింత స్ఫష్టత రానుంది.

IPL 2020: Purple Cap now with Rabada, Orange stays with KL
రబాడ చేతికి పర్పుల్.. ఆరెంజ్ రాహుల్​దేనా?
author img

By

Published : Nov 9, 2020, 4:05 PM IST

ఐపీఎల్ 13వ సీజన్​ ముగింపు దశకు వచ్చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ముంబయి ఇండియన్స్-దిల్లీ క్యాపిటల్స్ తుదిపోరుకు సిద్ధమయ్యాయి. దీంతో పర్పుల్, ఆరెంజ్ క్యాప్​లపైనా ఓ స్పష్టత వచ్చేసింది. ప్రస్తుతం దిల్లీ బౌలర్ రబాడ పర్పుల్​ క్యాప్​తో ఉండగా.. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్​తో కొనసాగుతున్నాడు.

IPL 2020: Purple Cap now with Rabada, Orange stays with KL
రబాడ

పర్పుల్​ క్యాప్

సన్​రైజర్స్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో నాలుగు వికెట్లతో మెరిసిన దిల్లీ బౌలర్ రబాడ.. పర్పుల్ క్యాప్​ను బుమ్రా నుంచి తిరిగి లాగేసుకున్నాడు. ఈ మ్యాచ్​లో 29 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో లీగ్​లో ఇతడి వికెట్ల సంఖ్య 29 (16 మ్యాచ్​లు)కి చేరింది. బుమ్రా 14 మ్యాచ్​ల్లో 27 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

బుమ్రా

ఆరెంజ్ క్యాప్

పంజాబ్ సారథి కేఎల్ రాహుల్(670 పరుగులు) అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్ జాబితాలో ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. సన్​రైజర్స్​-దిల్లీ మ్యాచ్​లో 78 పరుగులతో మెరిసిన ధావన్(603 పరుగులు)..​ ఈ సీజన్​లో 600 పరుగుల మార్కును అందుకున్నాడు. మంగళవారం జరగబోయే ఫైనల్లో మరో 64 పరుగులు సాధిస్తే ఆరెంజ్ క్యాప్​ను ధావన్ చేజిక్కించుకునే వీలుంది.

ధావన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.