నేడు (మంగళవారం) కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనున్న దిల్లీ క్యాపిటల్స్‌కు ఉత్సాహాన్నిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవల గాయపడి పలు మ్యాచ్‌లకు దూరమైన వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ మళ్లీ ఈ మ్యాచ్‌తో మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం పంత్ కోలుకుని పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని వెల్లడించారు. అయితే సాయంత్రం టాస్కు ముందు మరోసారి వైద్యులతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి బట్లర్‌కు ధోనీ కానుక.. ఏంటంటే!