ముంబయి ఇండియన్స్ విజయం
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 34 రన్స్ తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సారథి రోహిత్ శర్మ 6 పరుగులే చేసి ఔటయ్యాడు. కానీ డికాక్ 67 పరుగులతో సత్తాచాటాడు. సూర్య కుమార్ యాదవ్ (27), ఇషాన్ కిషన్ (31) కూడా పర్వాలేదనిపించారు. చివర్లో హార్డిక్ (28), పొలార్డ్ (25) మెరుపులు మెరిపించడం వల్ల భారీ స్కోర్ చేసింది ముంబయి.
209 పరుగుల భారీ లక్ష్య చేధన కోసం బరిలో దిగిన సన్‌రైజర్స్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ముఖ్యంగా బెయిర్‌స్టో (25) చెలరేగిపోయాడు. ఇతడి జోరు చూస్తే సన్‌రైజర్స్ గెలుపు సులభమే అనిపించింది. కానీ అతడు ఔటయ్యాక కాస్త ఒత్తిడిలో పడింది హైదరాబాద్. కెప్టెన్ వార్నర్ (60) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అవసరమైన సమయంలో పెవిలియన్ చేరాడు. తర్వాత రన్‌రేట్ క్రమంగా పెరగడం వల్ల పరాజయం పాలైంది సన్‌రైజర్స్.