ETV Bharat / sports

ముంబయి ఇండియన్స్​పై చెన్నై సూపర్ విక్టరీ - ధోనీ చెన్నై ముంబయి మ్యాచ్

IPL 2020: MI vs CSK
ఐపీఎల్ 2020
author img

By

Published : Sep 19, 2020, 6:43 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

23:21 September 19

చెన్నై విజయం..

ఉత్కంఠగా సాగిన ఐపీఎల్ 13 సీజన్​ మొదటి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై చెన్నై సూపర్​కింగ్స్ విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై విజయంలో అంబటి రాయుడు(71), డుప్లెసిస్ (58) కీలక పాత్ర పోషించారు. 

22:32 September 19

రాయుడు అర్ధ శతకం

ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్​కింగ్స్ అనంతరం నిలకడగా ఆడుతోంది. క్రీజులో ఉన్న రాయుడు, డుప్లెసిస్ ముంబయి బౌలర్లను సమర్థమంతగా ఎదుర్కొని పరుగులు సాధిస్తున్నారు. ఈ క్రమంలో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు రాయుడు. దీంతో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 88 పరుగులు చేసింది

21:51 September 19

వరుసగా రెండో వికెట్ కోల్పోయింది చెన్నై జట్టు. రెండో ఓవర్​ ముగిసేసరికి మరో ఓపెనర్ మురళీ విజయ్ ఒక పరుగే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం 2 ఓవర్లకు ఆరు పరుగులు చేశారు. 

21:45 September 19

చెన్నై సూపర్​కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగులు చేసిన ఓపెనర్ వాట్సన్.. బౌల్ట్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. తొలి ఓవర్ ముగిసేసరికి 5 పరుగులు చేసింది ధోనీసేన.

21:24 September 19

ముంబయి ఇండియన్స్ స్కోరు 162/9

చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్​లో ముంబయి తన ఇన్నింగ్స్​ను ముగించింది. 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. డికాక్ (33), సౌరభ్ తివారీ (42) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగిలిన వారు నామమాత్రంగా పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఎంగిడి 3, జడేజా, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

21:14 September 19

పొలార్డ్ ఔట్

ఏడో వికెట్​గా కీరన్ పొలార్డ్ ఔటయ్యాడు. కేవలం 18 పరుగులే చేసి పెవలియన్ చేరుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్ చాహర్, జేమ్స్ పాటిన్సన్ ఉన్నారు. 18.1 ఓవర్లలో 152 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్.

21:04 September 19

ఆరో వికెట్​గా వెనుదిరిగిన కృనాల్

ముంబయి ఆల్​రౌండర్ కృనాల్ పాండ్య.. కేవలం 3 పరుగులే చేసి ఆరో వికెట్​గా వెనుదిరిగాడు.

20:54 September 19

హార్దిక్ పాండ్య పెవిలియన్​కు

డుప్లెసిస్ పట్టిన అద్భుతమైన క్యాచ్​ వల్ల యువ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య కేవలం 14 పరుగులే చేసి పెవిలియన్​కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో కృనాల్ పాండ్య, పొలార్డ్ ఉన్నారు.

20:51 September 19

సౌరభ్ తివారీ ఔట్

29 పరుగులు చేసిన సౌరభ్ తివారీ.. నాలుగో వికెట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 14.1 ఓవర్లో 121 పరుగులు చేసింది ముంబయి.

20:33 September 19

మూడో వికెట్​గా సూర్యకుమార్

ముంబయి ఇండియన్స్ మూడో వికెట్​గా సూర్యకుమార్ యాదవ్ వెనుదిరిగాడు. 16 బంతుల్లో 17 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్​లో ఔటయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 92 పరుగులతో ఉంది రోహిత్​సేన.

20:29 September 19

10 ఓవర్ల ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ ఉన్నారు.

20:05 September 19

ఓపెనర్లు ఇద్దరూ ఔట్​..

ముంబయి ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. తొలుత పీయూష్​ చావ్లా ఓవర్లో రోహిత్​ ఔటవ్వగా.. మరుసటి ఓవర్లోనే వెనుదిరిగాడు డికాక్​(33). సౌరభ్​ తివారీ, సూర్యకుమార్​ యాదవ్ క్రీజులో ఉన్నారు.   

20:02 September 19

తొలి వికెట్​ కోల్పోయిన ముంబయి..

దూకుడుగా ఇన్నింగ్స్​ ఆరంభించిన ముంబయి తొలి వికెట్​ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రోహిత్​ శర్మ.. పీయూష్​ చావ్లా బౌలింగ్​లో వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి 48 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్​. డికాక్​(33), సూర్యకుమార్​ యాదవ్​(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

19:33 September 19

తొలి ఓవర్​ ధాటిగా ఆరంభించిన ముంబయి

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించింది ముంబయి జట్టు. రోహిత్ శర్మ, డికాక్ ఓపెనర్లుగా మైదానంలో అడుగుపెట్టారు. తొలి ఓవర్ పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 12 పరుగులు చేశారు.

19:01 September 19

బౌలింగ్ ఎంచుకున్న ధోనీసేన

టాస్ గెలిచిన ధోనీ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేయనుంది ముంబయి ఇండియన్స్.

జట్లు

చెన్నై సూపర్​కింగ్స్: మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, లుంగి ఎంగిడి

ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, పొలార్డ్, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

18:33 September 19

స్టేడియానికి చేరుకున్న చెన్నై, ముంబయి జట్ల క్రికెటర్లు

అబుదాబి వేదికగా ఐపీఎల్ తొలి మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. చెన్నై-ముంబయి జట్లు హోరాహోరీగా తలపడేందుకు రెడీ అయ్యాయి. మరికాసేపట్లో టాస్ వేయనున్నారు.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.