ETV Bharat / sports

ముంబయి బౌలర్ల ధాటికి తేలిపోయిన రాజస్థాన్​

IPL 2020
ఐపీఎల్​ 2020
author img

By

Published : Oct 6, 2020, 6:55 PM IST

Updated : Oct 6, 2020, 11:23 PM IST

23:15 October 06

57 పరుగుల తేడాతో విజయం

194 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్​ రాయల్స్​ మరో 11 బంతులు మిగిలుండగానే 136 పరుగులకే ఆలౌట్​ అయ్యింది. దీంతో 57 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్​ ఘనవిజయం సాధించింది. అటు బ్యాటింగ్​లో సూర్యకుమార్​ యాదవ్​(79), ఇటు బౌలింగ్​లో​ జస్​ప్రీత్​ బుమ్రా నాలుగు వికెట్లు సాధించి జట్టుకు గెలుపును అందించడంలో కీలకపాత్ర పోషించారు. రాజస్థాన్ రాయల్స్​ బ్యాట్స్​మన్​ జోస్​ బట్లర్​(70) మెరుపు ఇన్నింగ్స్​ వృథాగా మిగిలిపోయింది.

23:10 October 06

ఆర్చర్​ ఔట్​

బుమ్రా వేసిన బౌలింగ్​లో భారీషాట్​కు ప్రయత్నించిన జోఫ్రా ఆర్చర్​(24) పోలార్డ్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 18 ఓవర్లలో రాజస్థాన్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది. 

23:03 October 06

శ్రేయస్​ గోపాల్​ ఔట్​

15వ ఓవర్​ వేసిన బూమ్రా వరుస యార్కర్లతో రాజస్థాన్​ బ్యాట్స్​మెన్​ను ఇబ్బంది పెట్టాడు. ఒకే ఓవర్​లో తెవాతియా(5), శ్రేయస్​ గోపాల్​(1) వికెట్లను దక్కించుకున్నాడు. 16 ఓవర్లకు రాజస్థాన్​ ఎనిమిది వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఆర్చర్​(5), అంకిత్ రాజ్​పుత్​​(0)లు ఉన్నారు.

22:55 October 06

తెవాతియా ఔట్​

జస్​ప్రీత్​ బుమ్రా బౌలింగ్​లో రాహుల్​ తెవాతియా(5) వెనుదిరిగాడు. బుమ్రా వేసిన యార్కర్​కు తెవాతియా మిడిల్ వికెట్​ను సమర్పించుకున్నాడు. 

22:53 October 06

టామ్​ కరన్​ ఔట్​

ముంబయి బౌలర్​ కిరన్​ పొలార్డ్​ వేసిన బంతిని భారీ షాట్​గా మలచబోయిన టామ్​ కరన్​(15) ఫీల్డర్​ హార్దిక్​ పాండ్యాకు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

22:51 October 06

14 ఓవర్లకు రాజస్థాన్​ 102/5

14 ఓవర్లలో రాజస్థాన్ ఐదు వికెట్లు నష్టపోయి 102 పరుగులు చేసింది. క్రీజ్​లో ప్రస్తుతం తెవాతియా(4), టామ్​ కరన్​(11)లు ఉన్నారు. 

22:44 October 06

జోస్​ బట్లర్​ ఔట్​

కష్టాల్లో ఉన్న రాజస్థాన్​ జట్టుకు తన షాట్లతో బ్యాట్స్​మన్​ జోస్​ బట్లర్​(70) స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. జేమ్స్​ పాటిన్సన్​ వేసిన బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించి పొలార్డ్​కు క్యాచ్​ ఇచ్చి పెవీలియన్​ చేరాడు.

22:34 October 06

జోస్​ బట్లర్​ హాఫ్​సెంచరీ

రాజస్థాన్​ రాయల్స్​ బ్యాట్స్​మెన్​ బ్యాటింగ్​లో దూకుడు పెంచారు. 12 ఓవర్లకు రాజస్థాన్​ నాలుగు వికెట్లు కోల్పోయి 84 పరుగులు రాబట్టగలిగింది. ప్రస్తుతం క్రీజ్​లో జోస్​ బట్లర్​(59), టామ్​ కరన్​(6)లు ఉన్నారు.

22:31 October 06

10 ఓవర్లకు రాజస్థాన్​ 63/4

నాలుగు వికెట్లు పొగొట్టుకుని రాజస్థాన్​ రాయల్స్​ జట్టు కష్టాల్లో ఉంది. క్రీజ్​లో ప్రస్తుతం బట్లర్​(43), టామ్​ కరన్​(2)లు ఉన్నారు. 

22:27 October 06

లొమ్రోర్​ ఔట్​

ముంబయి స్పిన్నర్​ రాహుల్​ చాహర్​ వేసిన బంతికి లొమ్రార్​(11) షాట్​కు ప్రయత్నించి అనుకుల్​ రాయ్​ చేతికి క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

22:14 October 06

8 ఓవర్లకు రాజస్థాన్​ 42/3

ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న రాజస్థాన్​ రాయల్స్​ జట్టు​ నెమ్మదిగా పరుగులు రాబడుతుంది. 8 ఓవర్లకు రాజస్థాన్​ మూడు వికెట్లు నష్టపోయి 42 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో మహిపాల్​ లోమ్రోర్​​(11), బట్లర్​(24)లు ఉన్నారు. 

22:05 October 06

6 ఓవర్లకు రాజస్థాన్​ 31/3

6 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయిన రాజస్థాన్​ 31 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో మహిపాల్​ లోమ్రోర్​​(9), బట్లర్​(16)లు ఉన్నారు. 

21:57 October 06

4 ఓవర్లకు రాజస్థాన్ 16/3

194 లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్​ బ్యాట్స్​మెన్​ను ముంబయి బౌలర్లు ఆదిలోనే కట్టడి చేస్తున్నారు. తొలి మూడు ఓవర్లలోనే​ మూడు వికెట్లను సమర్పించుకున్న రాజస్థాన్.. నాలుగు ఓవర్లకు 16 పరుగులను చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో బట్లర్​(10), లోమ్రోర్​(0)లు ఉన్నారు. 

21:54 October 06

సంజు శాంసన్​ ఔట్​

రాజస్థాన్​ రాయల్స్​ బౌలర్​ ట్రెంట్​ బౌల్ట్​ వేసిన బంతికి రాజస్థాన్​ స్టార్ బ్యాట్స్​మన్​ సంజూ శాంసన్​ డకౌట్​గా వెనుదిరిగాడు. 

21:46 October 06

రాజస్థాన్​ రెండో వికెట్​ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్​లో కెప్టెన్​ స్మిత్​(6) ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 7/2. క్రీజులో సంజూ శాంసన్​, బట్లర్ ఉన్నారు. 

21:36 October 06

ఛేదన ఆరంభించిన రాజస్థాన్​కు​.. తొలి ఓవర్​లోనే షాక్​ తగిలింది. బౌల్ట్​ వేసిన ఓవర్​లో రాజస్థాన్​ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులో స్మిత్​, బట్లర్​ ఉన్నారు.

21:24 October 06

20 ఓవర్లలో ముంబయి 193/4

నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టపోయి ముంబయి 193 పరుగులు చేసింది. సూర్యకుమార్​ యాదవ్​(79), హార్దిక్​ పాండ్యా(30)లు అద్భుతమైన ఇన్నింగ్స్​తో 194 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్​కు నిర్దేశించారు. 

21:13 October 06

19 ఓవర్లకు ముంబయి 176/4

ముంబయి ఇండియన్స్​ బ్యాట్స్​మెన్​ సూర్యకుమార్​ యాదవ్​, హార్దిక్​ పాండ్యా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. 19 ఓవర్లకు ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో సూర్యకుమార్​ యాదవ్​(73), హార్దిక్​ పాండ్యా(20)లు ఉన్నారు.

21:04 October 06

18 ఓవర్లకు ముంబయి 161/4

18 ఓవర్లకు ముంబయి నాలుగు వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో సూర్యకుమార్​ యాదవ్​(66), హార్దిక్​​ పాండ్యా(17)లు ఉన్నారు. 

20:47 October 06

16 ఓవర్లకు ముంబయి 133/4

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు ముంబయి బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్​. 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి ముంబయి 133 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో సూర్యకుమార్​ యాదవ్​(52), హార్దిక్​ పాండ్యా(3)లు ఉన్నారు. 

20:39 October 06

క్రునాల్​ పాండ్యా ఔట్​

రాజస్థాన్​ బౌలర్​ ఆర్చర్​ వేసిన బంతికి క్రునాల్​ పాండ్యా(12) వెనుదిరిగాడు. 14 ఓవర్లకు ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ముంబయి బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్​(40) క్రీజ్​లో ఉన్నాడు.

20:27 October 06

నిలకడగా రాణిస్తున్న ముంబయి బ్యాట్స్​మెన్​

ముంబయి ఇండియన్స్​ బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్ 12వ ఓవర్​ ప్రారంభంలో వరుసగా రెండు ఫోర్లతో అలరించాడు. 12 ఓవర్లకు ముంబయి మూడు వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో సూర్యకుమార్​ యాదవ్​(37), క్రునాల్​ పాండ్యా(1)లు ఉన్నారు. 

20:24 October 06

10 ఓవర్లకు ముంబయి 90/3

పది ఓవర్లకు ముంబయి మూడు వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో సూర్యకుమార్​ యాదవ్​(25), క్రునాల్​ పాండ్యా(0)లు ఉన్నారు. 

20:22 October 06

ఇషాన్​ కిషన్​ ఔట్​

రాజస్థాన్​ రాయల్స్​ బౌలర్​ శ్రేయస్​ గోపాల్​ వేసిన బంతికి ముంబయి బ్యాట్స్​మన్​ ఇషాన్​ కిషన్ డకౌట్​గా వెనుదిరిగాడు.

20:13 October 06

హిట్​మ్యాన్ ఔట్​

రాజస్థాన్​ బౌలర్​ తెవాతియా వేసిన బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించిన ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ(35).. శ్రేయస్​ గోపాల్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

20:00 October 06

8 ఓవర్లకు ముంబయి 76/1

డికాక్​ రూపంలో తొలి వికెట్​ కోల్పోయిన ముంబయి ఇండియన్స్​.. ప్రస్తుతం బ్యాటింగ్​లో నిలకడగా రాణిస్తుంది. 8 ఓవర్లకు ముంబయి వికెట్​ నష్టపోయి 76 పరుగులు చేసింది. సూర్యకుమార్​ యాదవ్​(12), రోహిత్​ శర్మ (35) క్రీజ్​లో ఉన్నారు

19:57 October 06

6 ఓవర్లకు ముంబయి 57/1

ఆరు ఓవర్లకు ముంబయి వికెట్​ నష్టపోయి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రోహిత్ శర్మ(25), సూర్యకుమార్​ యాదవ్​(6)లు ఉన్నారు. 

19:52 October 06

డికాక్​ ఔట్​

ముంబయి ఇండియన్స్​ ఓపెనర్ల జోరుకు రాజస్థాన్​ బౌలర్​ కార్తిక్​ త్యాగి బ్రేక్​ వేశాడు. భారీ షాట్​కు ప్రయత్నించబోయిన డికాక్​(23) బట్లర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదు ఓవర్లుకు ముంబయి ఒక వికెట్​ నష్టపోయి 50 పరుగులు చేసింది. క్రీజ్​లో కెప్టెన్ రోహిత్​ శర్మ(25), సూర్యకుమార్​ యాదవ్​(1)లు ఉన్నారు.

19:39 October 06

దూకుడు పెంచిన ముంబయి

ముంబయి ఓపెనర్లు వరుస బౌండరీలతో అద్భుతమైన ప్రదర్శనతో రాణిస్తున్నారు. నాలుగు ఓవర్లకు ముంబయి ఇండియన్స్​ వికెట్​ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. రోహిత్​ శర్మ(18), డికాక్​(22) క్రీజ్​లో ఉన్నారు.  

19:33 October 06

2 ఓవర్లకు ముంబయి 14/0

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్​.. ఓపెనర్​ డికాక్​ ఫోర్​తో శుభారంభం ఇచ్చాడు. రెండు ఓవర్లు పూర్తయ్యే సమయానికి ముంబయి.. వికెట్​ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజ్​లో ప్రస్తుతం కెప్టెన్​ రోహిత్​ శర్మ(6), డికాక్​(7)లు ఉన్నారు.  

19:07 October 06

జట్ల వివరాలు

ముంబయి ఇండియన్స్:​ రోహిత్​ శర్మ(కెప్టెన్​), క్వింటన్​ డికాక్​(వికెట్​ కీపర్​), సూర్యకుమార్ యాదవ్​, ఇషాన్​ కిషణ్​, హార్దిక్​ పాండ్యా, పొలార్డ్​, కృనాల్​ పాండ్యా, పాటిన్సన్​, రాహుల్​ చాహర్​, బౌల్ట్​, జస్​ప్రీత్​ బుమ్రా

రాజస్థాన్​ రాయల్స్​: జోస్​ బట్లర్​(వికెట్​ కీపర్​),యశస్వి జైస్వాల్​, స్టీవ్​ స్మిత్​(కెప్టెన్​), సంజూ శాంసన్​, మహిపాల్​, రాహుల్​ తెవాటియా, టామ్ కరన్​, ఆర్చర్​, శ్రేయస్​ గోపాల్​, అంకిత్​ రాజ్​పుత్​, కార్తీక్​ త్యాగి.

19:02 October 06

బ్యాటింగ్​ ఎంచుకున్న ముంబయి

టాస్​ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్​ ఎంచుకుంది. ఎలాగైనా ఈ మ్యాచ్​ గెలిచి హ్యాట్రిక్​ కొట్టాలని కెప్టెన్​ రోహిత్​ శర్మ భావిస్తున్నాడు.

17:58 October 06

ముంబయి వేగాన్ని రాజస్థాన్​ ఆపగలదా?

అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్ మధ్య మ్యాచ్​ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

గత రెండు మ్యాచ్​లో విజయం సాధించిన ముంబయి.. ఈ మ్యాచ్​తో హ్యాట్రిక్​ కొట్టడానికి ప్రణాళికలను రచిస్తుంది. మరోవైపు వరుసగా రెండు ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్.. ముంబయిని ఓడించి టోర్నీలో మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. 

Last Updated : Oct 6, 2020, 11:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.