ETV Bharat / sports

దిల్లీ 'సూపర్' విక్టరీ- ఉత్కంఠ పోరులో గెలుపు - ఢిల్లీ vs పంజాబ్ ఐపీఎల్ 2020

IPL 2020 KXIP VS DC
దిల్లీ పంజాబ్ మ్యాచ్
author img

By

Published : Sep 20, 2020, 6:50 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

23:45 September 20

ఐపీఎల్​కు రెండో మ్యాచ్ కిక్కిచ్చింది. ఉత్కంఠ పోరులో పంజాబ్​పై దిల్లీ విజయం సాధించింది. సూపర్ ఓవర్​లో విజేతగా నిలిచింది. సూపర్ ఓవర్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ రెండు పరుగులకే పరిమితం కాగా.. సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది దిల్లీ.

23:34 September 20

సూపర్ ఓవర్లో పంజాబ్ ఢీలా- 2 పరుగులకే పరిమితం

పంజాబ్ తరపున జట్టు సారథి కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ బరిలోకి దిగారు.  తొలి బంతికి రెండు పరుగులు చేసిన రాహుల్.. రెండో బంతికి ఔట్​ అయి పెవీలియన్ బాట పట్టాడు. అనంతరం మ్యాక్స్​వెల్ క్రీజులోకి వచ్చాడు. దిల్లీ తరపున రబడ సూపర్ ఓవర్​కి బౌలింగ్ చేస్తున్నాడు. వెంటనే మూడో బంతికి నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడు పరుగులు చేస్తే విజయం దిల్లీని వరించనుంది.

23:27 September 20

దిల్లీ-పంజాబ్ మ్యాచ్ టై- సూపర్ ఓవర్​కు సిద్ధం

దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో దిల్లీ క్యాపిటల్స్​, పంజాబ్ మధ్య మ్యాచ్ టై అయింది. దిల్లీ 157 పరుగులు చేయగా.. పంజాబ్ సైతం అదే స్కోరు వద్ద నిలిచింది. పంజాబ్ తరపున 89 పరుగులు చేసి మ్యాచ్ టైగా ముగియడంలో కీలకంగా వ్యవహరించాడు మయాంక్ అగర్వాల్. ఇప్పుడు సూపర్ ఓవర్.. విజేతను నిర్ణయించనుంది.

23:14 September 20

ఛేదనలో పంజాబ్ విజయానికి చేరువవుతోంది. 18 ఓవర్లకు పంజాబ్ స్కోరు 136/6 గా ఉంది. మయాంక్ అగర్వాల్ ధాటిగా ఆడుతున్నాడు. అర్ధశతకం చేశాడు.

22:49 September 20

దిల్లీ బౌలర్ అశ్విన్​ భుజానికి గాయమైంది. బంతిని పట్టే క్రమంలో ఇది జరిగింది. ప్రస్తుతం ఛేదనలో పంజాబ్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజులో కృష్ణప్ప గౌతమ్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు.

22:32 September 20

ఛేదనలో పంజాబ్ జట్టు తడబడుతోంది. ప్రస్తుతం 11 ఓవర్ల నష్టానికి 5 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. క్రీజులో కృష్ణప్ప గౌతమ్, మాయంక్ అగర్వాల్ ఉన్నారు.

22:14 September 20

స్టార్ ఆల్​రౌండర్ మ్యాక్స్​వెల్ కూడా రబాడా బౌలింగ్​లో ఔటయ్యాడు. కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్​ చేరాడు. ప్రస్తుతం 6.3 ఓవర్లలో 35/4 పరుగులతో ఉంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

22:07 September 20

కేవలం ఒక్క పరుగే చేసిన కరుణ్ నాయర్.. అశ్విన్ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు. ప్రస్తుతం 5.3 ఓవర్లలో 34 పరుగులతో ఉంది పంజాబ్. క్రీజులో పూరన్, మాయంక్ అగర్వాల్ ఉన్నారు.

22:03 September 20

కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలి వికెట్​గా వెనుదిరిగాడు. 21 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్​లో ఔటయ్యాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు 33 పరుగులు చేసింది పంజాబ్

21:45 September 20

158 పరుగుల లక్ష్యంతో పంజాబ్ జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించింది. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమి నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు.

21:14 September 20

KXIP
వికెట్ తీసిన ఆనందంలో పంజాబ్ బౌలర్

దుబాయ్​ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 39, పంత్ 31, స్టోయినిస్ 53 మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. పంజాబ్​ బౌలర్లలో షమి 3, కాట్రెల్ 2, రవి బిష్ణోయ్ ఓ వికెట్ పడగొట్టారు.

20:57 September 20

దిల్లీ క్యాపిటల్స్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో స్టోయినిస్, అశ్విన్ ఉన్నారు.

20:41 September 20

దిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు. షమి బౌలింగ్​లో క్రిస్ జోర్డాన్​కు క్యాచ్​ ఇచ్చి పెవలియన్​ బాటపట్టాడు.

20:38 September 20

దిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన పంత్.. రవి బిష్ణోయ్ బౌలింగ్​లో వెనుదిరిగాడు. ప్రస్తుతం 14 ఓవర్లకు 86 పరుగులతో ఉంది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్ ఉన్నారు.

20:30 September 20

శ్రేయస్, పంత్ నెమ్మదిగా

దిల్లీ క్యాపిటల్స్ నిదానంగా ఆడుతోంది. 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 64 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, పంత్ ఉన్నారు.

20:17 September 20

నిలకడగా ఆడుతోన్న దిల్లీ..

మూడో వికెట్​ కోల్పోయిన తర్వాత దిల్లీ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 9 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్​ అయ్యర్​(15), రిషభ్​ పంత్​(15) ఉన్నారు. 

19:52 September 20

హెట్​మయర్​ ఔట్​..

దిల్లీ క్యాపిటల్స్​ మూడో వికెట్​ కోల్పోయింది. హెట్​మయర్​ 7 పరుగులు చేసి పెవిలియన్​ బాట పట్టాడు. 4 ఓవర్లకు జట్టు 13 పరుగులు చేసింది. 

19:48 September 20

పృథ్వీ షా ఔట్​...

దిల్లీ క్యాపిటల్స్ 9 పరుగుల వద్ద​ రెండో వికెట్​ కోల్పోయింది. 5 పరుగులు చేసి.. షమీ బౌలింగ్​లో జోర్డాన్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

19:38 September 20

అనవసర పరుగుకు ప్రయత్నించి డకౌట్​గా వెనుదిరిగాడు శిఖర్ ధావన్. ప్రస్తుతం 1.4 ఓవర్లలో 6 పరుగులు చేసింది దిల్లీ జట్టు.

19:33 September 20

తొలి ఓవర్ ముగిసేసరికి వికెట్లేమి నష్టపోకుండా 5 పరుగులు చేసింది దిల్లీ క్యాపిటల్స్. క్రీజులో ధావన్, పృథ్వీషా ఉన్నారు.

19:17 September 20

రవి బిష్ణోయ్ ఇన్.. గేల్ ఔట్

భారత్​ తరఫున అండర్-19 ప్రపంచకప్​లో ఆకట్టుకున్న స్పిన్నర్ రవి బిష్ణోయ్​.. దిల్లీ-పంజాబ్ మ్యాచ్​తో అరంగేట్రం చేయనున్నాడు. అయితే గేల్​కు జట్టులో అవకాశం దక్కలేదు.

18:52 September 20

టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్​ గెలిచి ఘనంగా బోణీ కొట్టాలని కెప్టెన్ కేఎల్ రాహుల్ భావిస్తున్నాడు.

జట్లు వివరాలు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, గ్లెన్ మ్యాక్స్​వెల్, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, షెల్డన్ కాట్రల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమి

దిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్, హెట్మయిర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, అన్రిచ్ నోర్ట్జ్, మోహిత్ శర్మ

18:39 September 20

తొలి విజయం ఎవరిది?

దుబాయ్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం. విజయం దక్కించుకోవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.