దిల్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. తొడ కండరాల నొప్పితో ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైన పంత్‌ది తీవ్రమైన గాయమేనని తెలుస్తోంది. 'పంత్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాడు కావడం వల్ల అతడి గాయానికి సంబంధించిన స్కాన్ నివేదికలను దిల్లీ.. బీసీసీఐకి పంపింది. 'అతడికి తొడ కండరాల్లో గ్రేడ్-1 చీలిక ఏర్పడింది' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
పంత్ దూరం కావడం వల్ల దిల్లీ చివరి మ్యాచ్‌లో అలెక్స్ కేరీని జట్టులోకి తీసుకురావాల్సి వచ్చింది. దీంతో జట్టు సమతౌల్యం దెబ్బతింది. హెట్‌మైయర్‌ను డగౌట్‌కు పరిమితం చేయాల్సి వచ్చింది. జట్టులో హెట్‌మైయర్, రబాడ, నార్జే, స్టాయినిస్‌లను ఆడించేందుకు వీలుగా.. లలిత్ యాదవ్‌కు వికెట్‌కీపింగ్ బాధ్యతలు అప్పగించాలని దిల్లీ భావిస్తోంది.
ఇదీ చూడండి: 'ఐపీఎల్లో నేను రాణించనది అందుకే'