ETV Bharat / sports

మరికొద్దిసేపట్లోనే మెగా టోర్నీ.. చూసేందుకు సిద్ధమేనా? - ఐపీఎల్ చెన్నై-ముంబయి మ్యాచ్

మహా ధమాకా మొదలవుతోంది. మరి కొద్ది సేపట్లోనే ...యూఏఈ వేదికగా బయో బబూల్ లో క్రికెట్ బ్లాస్ట్ జరగనుంది. అభిమానుల అరుపులు... చీర్ లీడర్లు చిందులు.. మైదానంలో సందడి.. ఇవేమీ లేకుండానే మొదటిసారి మెగా టోర్నీ జరుగుతోంది. ఇవేమీ లేకపోయినా..ఆటలోని అసలైన మజా పక్కా అంటున్నాయి... ఐపీఎల్ టీీమ్​లు..! మరికెందుకు ఆలస్యం.. టీవీలకు అతుక్కుపోండి..!

ipl-2020-curtain-raiser
ఐపీఎల్ 2020
author img

By

Published : Sep 19, 2020, 4:40 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

కొవిడ్ మనతో లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతోంది. ఆధునిక సమాజం ఇప్పటి వరకూ కనీవినీ ఎరుగని కఠినమైన టెస్ట్ మ్యాచ్ ఇదీ. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం పెవిలియన్​కే పరిమితం అయిపోయింది. టీమ్ కరోనా పని పట్టాలని, వైద్యుల కెప్టెన్సీ లో శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ టీమ్ తీవ్రంగా కృషి చేస్తోంది. యూరప్ దేశాల్లో సెకండ్ వేవ్ అంటూ అపోజిషన్ టీమ్ చేస్తున్న విజృంభణ చూస్తుంటే, మన వంతు వచ్చినా ఫాలో ఆన్ ఆడక తప్పదేమో అనే సందేహమే మనసును తొలిచేస్తోంది. ఓ రకంగా మనమందరం అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ ఇది. ఈ హోరాహారీ నుంచి కొంచెం ఆటవిడుపుగా మనల్ని ఎంటర్​టైన్ చేయడానికి వచ్చేసింది ఐపీఎల్.

కరోనాతో టెస్టులో అలిసిపోయిన మనకు మానసిక ప్రశాంతత కలిగించటం సహా టీ20 క్రికెట్ రుచి చూపించేందుకు మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. కాలంతోపాటు క్రికెట్లోనూ మార్పులొచ్చాయి. ఒకప్పుడు రోజుల పరిమితి లేకుండా మ్యాచులు జరిగిన కాలం నుంచి కేవలం మూడు నాలుగు గంటల్లో ముగిసిపోయే జమానాకు వచ్చేశాం.

గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఫుట్​బాల్ తర్వాత క్రీడా ప్రేమికులు.. అత్యంత ఆసక్తి చూపించే క్రికెట్​ను మరో స్థాయికి తీసుకెళ్లింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. పన్నెండు సీజన్​లుగా మనల్ని అలరిస్తూ, ఎందరో వర్ధమాన క్రీడాకారులను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిందీ టోర్నీ. ఫామ్ కోల్పోయి తిరిగి జట్టులోకి వచ్చేందుకు కష్టపడుతున్న ఎందరో సీనియర్లకూ ఓ ఆసరాగా మారి అవకాశాన్ని కల్పించింది.

అలాంటి ఐపీఎల్ కరోనా మహమ్మారి కారణంగా అసలు జరుగుతుందా లేదా అనే సంశయాన్ని, సందిగ్దతను దాటుకుని మరికొన్ని గంటల్లోనే అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.

అసలు ఏముంది ఈ క్రికెట్​లో పైగా ఐపీఎల్ అనేది పూర్తి వ్యాపారమే కదా అనే విమర్శలు.. వాటి చుట్టూ స్పాట్ ఫిక్సింగ్​ల కారుచీకట్లు ఎన్నిసార్లు ముసురుకున్నా.. ఐపీఎల్ ప్రభ ఏమాత్రం తగ్గలేదు. కారణం వివిధ దేశాల్లో గొప్ప క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న వారంతా క్రికెట్​ను ఓ మతంగా భావించే భారత్​కు వచ్చి, తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించడం ఈ టోర్నీలో అసలు ఆకర్షణ.

ఇదే ఒరవడిని మరికొన్ని క్రికెట్ ఆడే దేశాలు అవలంబిస్తున్నా మనకున్న అభిమాన గణం... ఐపీఎల్ బలం. స్టేడియాలకు పోటెత్తడమే కాదు.. టీవీలకు అతుక్కుపోయి టీఆర్పీ రేట్ల రికార్డులను బ్రేక్ చేయడంలోనూ మనవాళ్ళు సిద్దహస్తులు. అందుకే అనతికాలంలోనే ఐపీఎల్ అగ్ర సింహాసనాన్ని అధిష్టించింది.

కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. కరోనా మహమ్మారి ఉధ్ధృతికి స్టేడియాలన్నీ ఖాళీ అయితే మన క్రికెటర్లు అంతా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. సుదీర్ఘ లాక్​డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులకు అలవాటు పడుతున్న తరుణంలో ఖాళీ స్టేడియంలో మ్యాచ్​లను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. భారత్​లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈసారి యూఏఈ భారీ టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. అక్కడ ఐపీఎల్ ఆడటం కొత్తేం కాదు. అందుకే గత అనుభవం దృష్ట్యా లీగ్ నిర్వహించేందుకు బోర్డు సైతం ధీమాగా ఉంది.

ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు రాత్రికి జరిగే మ్యాచ్​తో క్రికెట్ ఉత్సవం ప్రారంభం కానుంది. హిట్ మ్యాన్ రోహిత్ సారథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే... అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తొలిసారి మైదానంలో అడుగుపెడుతున్న ధోనీ కెప్టెన్సీలో చెన్నై అమీ తుమీ తేల్చుకునేందుకు సన్నద్ధమవుతోంది.

కరోనాతో పోరాటంలో అలసిన మనసులకు సాంత్వన చేకూర్చేందుకు.. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ టోర్నీ మీరంతా ఆస్వాదించేలా లైవ్ అప్డేట్స్, న్యూస్​ను ఈటీవీ భారత్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఎంజాయ్ ది ఐపీఎల్.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.