ETV Bharat / sports

భువనేశ్వర్​ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడెవరు? - సన్​రైజర్స్​ హైదరాబాద్​ వార్తలు

సన్​రైజర్స్​ హైదరాబాద్​ పేసర్​ భువనేశ్వర్​ కుమార్ గాయం కారణంగా ప్రస్తుత ఐపీఎల్​ నుంచి నిష్క్రమించాడు. అయితే అతడి స్థానంలో ప్రత్యామ్నాయంగా తీసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

IPL 2020: 3 players who can replace Bhuvneshwar Kumar at Sunrisers Hyderabad
భువనేశ్వర్​ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడేవరు?
author img

By

Published : Oct 5, 2020, 9:30 PM IST

గాయం కారణంగా ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ నుంచి తప్పుకున్నాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ పేసర్​ భువనేశ్వర్​ కుమార్​. టోర్నీ చరిత్రలో రెండు సార్లు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్​గా పర్పుల్​ క్యాప్​ విజేతగా నిలిచాడు. ఇప్పుడు ఇతడి లోటుతో సర్​రైజర్స్ బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బని చెప్పాలి. ఇటీవలే చెన్నై సూపర్​ కింగ్స్​తో మ్యాచ్​లో తొడ కండరం పట్టేయడం వల్ల అర్ధాంతరంగా మ్యాచ్​ నుంచి నిష్క్రమించాడు. తాజాగా చేసిన పరీక్షల్లో గాయం మరింత తీవ్రమవ్వడం వల్ల టోర్నీ నుంచే శాశ్వతంగా తప్పుకున్నట్లు ఎస్​ఆర్​హెచ్​ యాజమాన్యం స్పష్టం చేసింది.

జట్టుకు ప్రధాన బలమైన పేసర్​ భువీ దూరమవ్వడం వల్ల యాజమాన్యం మరో బౌలర్​ కోసం ఆసక్తి చూపకపోవచ్చు. ఇప్పటికే సన్​రైజర్స్​లో ఎక్కువమంది బౌలర్లు ఉన్నారు. మిడిల్​ ఆర్డర్​లో బ్యాట్స్​మన్​ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో భువనేశ్వర్​ స్థానాన్ని భర్తీ చేయగల ముగ్గురు ఆటగాళ్లను పరిశీలిద్దాం.

3) యూసఫ్​ పఠాన్

గత రెండు ఐపీఎల్​ సీజన్లలో సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహించాడు యూసఫ్​ పఠాన్. ప్రస్తుత సీజన్​లో యువ ఆల్​రౌండర్లు జట్టులో ఉన్నప్పటికీ అనుభవజ్ఞుడైన యూసఫ్​ను యాజమాన్యం ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

IPL 2020: 3 players who can replace Bhuvneshwar Kumar at Sunrisers Hyderabad
యూసఫ్​ పఠాన్​

ఇటీవలే షార్జా వేదికగా ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ జట్టు బ్యాటింగ్​లో రాణించలేక పోయింది. ఈ కారణంగా హిట్టర్​గా పేరొందిన యూసఫ్​ పఠాన్​ను కీలకమైన బ్యాటింగ్​ స్థానాల్లో బరిలో దించవచ్చు. అవసరమైతే స్పిన్ ​బౌలింగ్​ కూడా వేయగలడు.

యూసఫ్​ పఠాన్.. ఐపీఎల్​ కెరీర్​లో 154 ఇన్నింగ్స్​ల్లో 142.97 స్ట్రైక్​ రేట్​తో 3,204 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్​ వేలంలో యూసఫ్​ను ఏ జట్టూ సొంతం చేసుకోలేదు.

2) ఆర్​.వినయ్​ కుమార్​

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో అత్యంత అనుభవజ్ఞుడైన ఆర్​.వినయ్​ కుమార్​నూ భువీ స్థానం కోసం పరిశీలించవచ్చు. గతంలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, కొచ్చి టస్కర్స్​ కేరళ, ముంబయి ఇండియన్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు.

ఆర్​ వినయ్​ కుమార్​

ఐపీఎల్​లో ఇప్పటివరకు 105 మ్యాచ్​లు ఆడి 105 వికెట్లు పడగొట్టాడు వినయ్​ కుమార్​. ఈ ఏడాది ఆరంభంలో రంజీట్రోఫీలో పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహించి ఆరు వికెట్లు సాధించాడు. తాను ఆడిన చివరి ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లో అర్ధశతకాన్ని నమోదు చేశాడు.

1) రోహన్ కదమ్

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టులో యువతకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మిడిల్​ ఆర్డర్​లో అబ్దుల్​ సమద్​, ప్రియమ్​ గార్గ్​, అభిషేక్​ వర్మలను ఎంపికచేశారు. భువనేశ్వర్​ కుమార్​ స్థానంలో రోహన్​ కదమ్​కు అవకాశం ఇవ్వడం ద్వారా మిడిల్​ ఆర్డర్​లో మరో యువ ఆటగాడ్ని చేర్చినట్లు అవుతుంది.

రోహన్​ కదమ్​ ఇప్పటివరకు ఆడిన 20 టీ20 మ్యాచ్​లలో 49.62 సగటుతో 794 పరుగులు సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబయి జట్టుపై 71 రన్స్​తో చెలరేగాడు. లెగ్ బ్రేక్ కూడా వేయగలడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.