ETV Bharat / sports

'యువతరానికి జట్టును అప్పగించే సమయం వచ్చింది' - ధోనీ వార్తలు

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో కొన్ని లోపాల వల్ల తమ జట్టు లీగ్​ దశ నుంచే నిష్క్రమించిందని చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ అన్నాడు. కానీ, ఇప్పుడు జట్టును యువతరం చేతిలో పెట్టాల్సిన అవసరం ఉందని మహీ అభిప్రాయపడ్డాడు.

IPL 13: Time to hand over this team to next-generation, says Dhoni
'యువతరానికి జట్టును అప్పగించే సమయం వచ్చింది'
author img

By

Published : Nov 1, 2020, 10:33 PM IST

అబుదాబి వేదికగా కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో చెన్నై సూపర్​కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో గెలిచినా.. లీగు దశ నుంచే ధోనీసేన వైదొలగింది. ఐపీఎల్​ చరిత్రలో సీఎస్కే లీగ్​ స్టేజ్​లోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇదే తొలిసారి. దీనిపై మ్యాచ్​ అనంతరం జరిగిన కార్యక్రమంలో ధోనీ స్పందించాడు. జట్టును కొత్త తరానికి అప్పగించే సమయం వచ్చిందని వెల్లడించాడు. ఆలస్యంగా జట్టులో చేరిన రుతురాజ్​ గైక్వాడ్​ అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు.

"మా జట్టుకు ఇది చాలా కష్టమైన సీజన్​. జట్టులో చాలా లోపాలు ఉన్నాయి. చివరి నాలుగు మ్యాచ్​ల్లో మా జట్టు చాలా బాగా రాణించింది. యువ ఆటగాళ్ల ప్రదర్శన గర్వంగా ఉంది. వచ్చే ఏడాది ఐపీఎల్​ కోసం బీసీసీఐ వేలం ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియదు. ముందుగా జట్టులో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ఐపీఎల్​ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మా ఆటగాళ్లందరూ సహకరించారు. ఇప్పుడు యువతరానికి జట్టును అప్పగించాలి. వచ్చే సీజన్​ కోసం బలంగా తిరిగి వస్తాం. రుతురాజ్​ బ్యాటింగ్​ను చూశాం. నెట్ ​సెషన్స్​లోనూ బాగా రాణించాడు. కానీ, మేము అతడి ఆటను చాలా మిస్​ అయ్యాం. కొవిడ్​ కారణంగా 20 రోజుల పాటు అతడు ఫిట్​గా లేడు."

-ధోనీ, చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో సీఎస్కే బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్​ అర్ధశతకాన్ని నమోదు చేయగా.. డుప్లెసిస్​, అంబటి రాయుడు అద్భుత బ్యాటింగ్​తో జట్టుకు విజయాన్ని అందించారు. బౌలింగ్​లో లుంగీ ఎంగిడి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.