ETV Bharat / sports

ఐపీఎల్​లో లెగ్​ స్పిన్నర్లే కీలకం!

గత సీజన్లతో పోలిస్తే అత్యధిక వికెట్లు తీసిన వారిలో స్పిన్నర్లు ఉంటున్నారు. యూఏఈలోని మైదానాల విషయమై అవగాహన వస్తే, స్పిన్నర్లు అద్భుతాలు చేయగలరని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు.

IPL 13
లెగ్​ స్పిన్నర్లు
author img

By

Published : Oct 7, 2020, 12:44 PM IST

మ్యాచ్​ గెలుపులో బ్యాట్స్​మన్​ ఎంత ముఖ్యమో బౌలర్​ కూడా అంతే కీలకం. స్పిన్నర్లకు ఉన్న పాధాన్యత చాలా ఎక్కువ. ఐపీఎల్​లో గత​ సీజన్ల గణాంకాలను పరిశీలిస్తే, ఎక్కువగా వికెట్లు పడగొట్టిన మొదటి ముగ్గురు బౌలర్లలో ఇద్దరు లెగ్ ​స్పిన్నర్లు ఉన్నారు. దీన్నిబట్టి టీ20 ఫార్మాట్​లో లెగ్​ స్పిన్నర్లు గుర్తింపు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ సీజన్​లో దిల్లీతో మ్యాచ్​లో ఆర్సీబీ స్విన్నర్​ చాహల్​ కాస్త నిరాశపరిచినప్పటికీ.. అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. రబాడా(12) పర్పుల్​ క్యాప్​తో కొనసాగుతున్నాడు.

IPL 13
యుజ్వేంద్ర చాహల్​

ముంబయి ఇండియన్స్ బౌలర్ రాహుల్ చాహర్​(ఐదు మ్యాచ్​ల్లో 7 వికెట్లు), సీఎస్కే స్పిన్నర్ చావ్లా(ఐదు మ్యాచ్​ల్లో 6 వికెట్లు), సన్​రైజర్స్ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​(ఐదు మ్యాచ్​ల్లో 5 వికెట్లు).. టాప్​ 20 మందిలో చోటు దక్కించుకున్నారు. మైదానం పెద్దగా ఉందనే అవగాహనకు వస్తే, స్పిన్నర్లు మరింత విశ్వాసంతో బౌలింగ్​ చేయొచ్చని భారత మాజీ లెగ్​ స్పిన్నర్​ నరేంద్ర పిర్వానీ అభిప్రాయపడ్డారు.

IPL 13
ఐపీఎల్​లో స్పిన్నర్లు వీరే

మైదానం పెద్దదైతే.. బౌలర్​ ఎక్కువగా రిస్క్​ తీసుకుంటాడు. బౌండరీలు పెద్దవి అని నాకు అవగాహన వస్తే.. బ్యాట్స్​మన్​పై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తా. కచ్చితంగా ఆడే వ్యక్తికి టెంప్ట్ అయ్యేలా బంతులను వేస్తాను. అప్పుడు అతడు గందరగోళానికి గురవుతాడు. అక్కడే పొరపాటు చేస్తాడు.

నరేంద్ర పిర్వానీ, టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్​

ముంబయి, రాజస్థాన్​ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్​లో నలుగురు లెగ్​ స్పిన్నర్లు తుది జట్టులో ఉన్నారు. ఇదే ధోరణి కొనసాగితే మైదానాల్లో లెగ్​ స్పిన్నర్లు విరుచుకుపడతారనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.