ETV Bharat / sports

రోహిత్​ గోల్డెన్ డకౌట్.. హిట్​మ్యాన్​కు ఏమైంది?

ఐపీఎల్​లో కెప్టెన్​గా విజయవంతమవుతున్న రోహిత్ శర్మ.. బ్యాట్స్​మన్​గా తేలిపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ పర్యటనకు ఇతడిని ఎంపిక చేయకపోవడం పలు ప్రశ్నలు రేకెత్తిస్తోంది. హిట్​మ్యాన్​కు ఏమైందని అభిమానులు, మాజీలు చర్చించుకుంటున్నారు.

author img

By

Published : Nov 6, 2020, 4:39 PM IST

India's tour to Aus: Rohit's golden duck adds to controversy
రోహిత్​శర్మకు గాయమా? లేదా ఫామ్​లో లేకపోవడమా​?

ఐపీఎల్​లో బ్యాట్స్​మన్​గా రోహిత్ శర్మ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. దిల్లీతో గురువారం జరిగిన క్వాలిఫయర్​లోనూ డకౌట్​ అయ్యాడు. దీంతో హిట్​మ్యాన్​ తన ఫిట్​నెస్​ నిరూపించుకోవాలని అంటున్న వారికి ఇది ఊతమిచ్చినట్లైంది. ఆస్ట్రేలియా పర్యటనకు హిట్​మ్యాన్​ను ఎంపిక చేయకపోవడానికి గాయం కాదని, ఫామ్​లేమినే ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు రోహిత్ శర్మకు ఏమైంది?

రోహిత్​ ప్రదర్శన

ప్రస్తుత ఐపీఎల్​లో రోహిత్​శర్మ వరుసగా చేసిన స్కోరు: 0, 4, 9, 35, 5, 35, 6, 70, 8, 80, 12.. మొత్తం కలిపి ఇప్పటివరకు 264 పరుగులు(11 మ్యాచ్​ల్లో) చేశాడు. టోర్నీ చరిత్రలో మొత్తం 199 మ్యాచ్​లు ఆడిన రోహిత్​.. 130.58 స్ట్రైక్​రేట్​తో 5,162 పరుగులు చేశాడు. అందులో 38 అర్ధశతకాలతో పాటు ఓ సెంచరీ ఉంది. ఈ సీజన్​లో మాత్రం అనుకున్నంతగా ఆడలేకపోతున్నాడు.

ఫిట్​గా లేడు!

రోహిత్​శర్మ ఫిట్​గా లేడని, అందుకే ఆసీస్ పర్యటనకు ఎంపిక చేయలేదని బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీ ఇటీవలే మీడియాతో చెప్పాడు. ప్రధానకోచ్ రవిశాస్త్రి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. కానీ, రోహిత్ ఐపీఎల్​లో ఆడుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

మాజీల ఒత్తిడి

ఐపీఎల్​ మొత్తంలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్​మెన్​ జాబితాలో విరాట్​ కోహ్లీ అగ్రస్థానంలో.. రోహిత్​ శర్మ రెండో స్థానంలో ఉన్నారు. ఈ టోర్నీలో కెప్టెన్​గా రోహిత్(ముంబయి)​ నాలుగుసార్లు ట్రోఫీ అందుకోగా.. కోహ్లీ(బెంగళూరు) మాత్రం ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు. ఈ నేపథ్యంలో హిట్​మ్యాన్​ను భారత టీ20 జట్టుకు కెప్టెన్​గా నియమించాలని మాజీలు అగార్కర్​, అతుల్​ వాసన్​ సూచించారు. ప్రస్తుతం టీమ్​ఇండియా టెస్టు, వన్డే, టీ20 జట్లకు కోహ్లీ కెప్టెన్​గా ఉన్నాడు. వైస్​ కెప్టెన్లుగా రహానె(టెస్టులకు), రోహిత్(వన్డే, టీ20లకు) ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.