ETV Bharat / sports

జడేజా అందుకే చివరి ఓవర్ వేశాడు: ధోనీ - ఐపీఎల్ ధావన్ తొలి సెంచరీ

దిల్లీ గెలవడానికి ధావన్ బ్యాటింగ్ కారణమని చెప్పిన సీఎస్కే కెప్టెన్ ధోనీ.. వేరే అవకాశం లేకపోవడం వల్లే జడేజా చివరి ఓవర్​ వేశాడని చెప్పాడు.

IPL 2020: Can't take credit away from Dhawan, says Dhoni after defeat against DC
జడేజా అందుకే చివరి ఓవర్ వేశాడు: ధోనీ
author img

By

Published : Oct 18, 2020, 7:51 AM IST

దిల్లీ చేతిలో ఓటమి గురించి చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్ ధోనీ స్పందించాడు. విజయంలో ప్రత్యర్థి బ్యాట్స్​మన్ ధావన్​కే క్రెడిట్ మొత్తం దక్కుతుందని తెలిపాడు. అలానే చివరి ఓవర్​ను రవీంద్ర జడేజాకు ఇవ్వడానికి గల కారణాన్ని మహీ వెల్లడించాడు. ఈ మ్యాచ్​లో శిఖర్ సెంచరీ చేయడం వల్ల, క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.

"బ్రావో ఫిట్​గా లేడు. మైదానం నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు నా ముందున్న ఆప్షన్స్ జడ్డూ, కర్ణ్. నేను జడేజాకే బౌలింగ్ అప్పజెప్పాను. శిఖర్ వికెట్​ మాకు చాలా ముఖ్యం. కానీ మేం అతడి క్యాచుల్ని చాలాసార్లు వదిలేశాం. రెండో ఇన్నింగ్స్​లో పిచ్ బ్యాటింగ్​కు బాగా సహకరించింది. అందుకే విజయం క్రెడిట్​ మొత్తం ధావన్​కే దక్కుతుంది" -మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై జట్టు కెప్టెన్

శనివారం జరిగిన ఈ పోరులో, టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. డుప్లెసిస్(58), రాయుడు(45), వాట్సన్(36), జడేజా(33) రాణించారు.

ఛేదనలో దిల్లీ ఓపెనర్ ధావన్(58 బంతుల్లో 101*).. ఐపీఎల్​లోనే తొలి శతకం చేసి జట్టుకు విజయం అందించాడు. దీంతో 5 వికెట్ల తేడాతో క్యాపిటల్స్ గెలుపొందింది.

dhawan ipl
దిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.