తాను గతంలో ఉన్న వ్యక్తిని కాదని, చాలా మారానని చెప్పాడు టీమ్ఇండియా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ మహమ్మద్ షమి. 2015, 2018లో గాయపడినప్పుడు, ఇకపై షమి ప్రమాదకర బౌలర్ కాలేడంటూ వార్తలు రాశారని, దాంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం వన్డేలు, టెస్టుల్లో భారత అగ్రశ్రేణి బౌలర్‌గా ఇతడు కొనసాగుతున్నాడు.
"2015, 2018లో గాయాలపాలైనప్పుడు నా కెరీర్ ముగిసిందని మీడియా రాసింది. ఒకవేళ తిరిగి మైదానంలో అడుగుపెట్టినా సరే మునుపటిలా ఆడలేనని తేల్చింది. అవును వాళ్లు చెప్పినట్లే నేను పాత వ్యక్తిని కాదు. వారు చేసిన ఆ వ్యాఖ్యలు నాలో చాలా మార్పు తీసుకొచ్చాయి" -మహమ్మద్ షమి, సీనియర్ పేసర్
95 కిలోలు ఉన్నా.. రిటైర్మెంట్ అన్నారు!
గాయాల నుంచి కోలుకున్న తర్వాత 95 కిలోల వరకు బరువు పెరిగాని చెప్పిన షమి.. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నానని తనకు అనిపించినట్లు పేర్కొన్నాడు. దీంతో శారీరక దృఢత్వంపై పూర్తి దృష్టి సారించినట్లు చెప్పాడు.
"గాయాలు తగ్గిన తర్వాత అందరూ ఏమనుకున్నారో నాకు తెలుసు. దానిని నేను మార్చలేను. బెడ్‌పై ఉన్న 60 రోజులు బంతిని నా పక్కనే పెట్టుకున్నాను. పరిస్థితులకు తగ్గట్లు మారాలని అప్పుడు తెలుసుకున్నాను" -మహమ్మద్ షమి, సీనియర్ బౌలర్
ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న షమి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనూ భారత్ తరఫున పాల్గొనే అవకాశముంది.