పంజాబ్ జట్టుపై వచ్చిన ఫలితం, రానున్న మ్యాచ్‌ల్లోనూ వస్తుందని చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. హ్యాట్రిక్ ఓటముల తర్వాత సీఎస్కే గెలిచిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది సీఎస్కే. ఓపెనర్లు డుప్లెసిస్-వాట్సన్ జోడీ.. చివరి వరకు ఉండి లాంఛనాన్ని పూర్తి చేశారు.
"మేం చాలా చిన్న పనులే చేశాం. అదే మాకు చాలా ముఖ్యం. ఇలాంటి బ్యాటింగ్ మాకే అవసరం. ఇదే ఫలితాన్ని రానున్న మ్యాచ్‌ల్లోనూ పునరావృతం చేయాలనుకుంటున్నాం. అయితే మాకు కావాల్సింది గాడిలో పడటమే. ఇప్పుడు అలానే ఉన్నాం అనిపిస్తోంది. వాటో(వాట్సన్), ఫాఫ్(డుప్లెసిస్).. ఫామ్‌లోకి వచ్చేశారు" -ధోనీ, చెన్నై జట్టు కెప్టెన్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(63), పూరన్(33) ఆకట్టుకున్నారు. అనంతరం బరిలో దిగిన చెన్నై.. రెండు ఓవర్లు మిగిలుండగానే వికెట్లేమి కోల్పోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు వాట్సన్(83*), డుప్లెసిస్(87*) అదరగొట్టేశారు.
తర్వాతి మ్యాచ్‌ల్లో కోల్‌కతాతో చెన్నై అక్టోబరు 7న, హైదరాబాద్‌తో పంజాబ్ అక్టోబరు 8న తలపడనున్నాయి.