ETV Bharat / sports

'పాండ్యా బౌలింగ్ చేసేంత ఫిట్​గా లేడు' - పాండ్యా బౌలింగ్ గురించి రోహిత్

ఈ సీజన్​లో ఇప్పటివరకు బౌలింగ్ చేయలేదు ముంబయి ఇండియన్స్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా. తాజాగా ఈ విషయమై స్పందించాడు ఆ జట్టు సారథి రోహిత్ శర్మ. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేంత ఫిట్​గా లేడని చెప్పాడు.

Hardik Pandya is not comfortable bowling at the moment Rohit
'పాండ్యా బౌలింగ్ చేసేంత ఫిట్​గా లేడు'
author img

By

Published : Nov 9, 2020, 9:32 PM IST

ముంబయి ఇండియన్స్ ఆల్​రౌండర్ హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం బౌలింగ్‌ చేసేంత ఫిట్‌గా లేడని ఆ జట్టు సారథి రోహిత్‌ శర్మ అన్నాడు. బౌలింగ్‌ చేస్తున్నప్పుడు అసౌకర్యానికి గురవుతున్నాడని వివరించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడీ విషయం చెప్పడం గమనార్హం. దుబాయ్‌ వేదికగా మంగళవారం ముంబయి, దిల్లీ ఇండియన్‌ టీ20లీగ్‌ ఫైనల్లో తలపడనున్నాయి.

Hardik Pandya is not comfortable bowling at the moment Rohit
పాండ్యా

"ప్రస్తుతానికి అతడు బౌలింగ్‌ చేసేందుకు సిద్ధంగా లేడు. అందుకే మేం నిర్ణయాన్ని అతడికే వదిలేశాం. అతడికి సౌకర్యంగా అనిపిస్తే ఎప్పుడైనా సంతోషంగా బౌలింగ్‌ చేయిస్తాం. ఇప్పటికైతే చిన్న చిన్న గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఈ సీజన్‌ మొత్తం అతడిని సౌకర్యవంతమైన జోన్‌లోనే ఉంచేందుకు ప్రయత్నించాం. అతడు కోలుకోవడం ఎంతో అవసరం."

-రోహిత్, ముంబయి సారథి

ప్రతి రెండు, మూడు మ్యాచులకు హార్దిక్‌ శారీరక పరిస్థితిని ముంబయి ఫిజియోలు పర్యవేక్షిస్తున్నారని రోహిత్‌ చెప్పాడు. అతడితో మాట్లాడి ఏం చేయాలని భావిస్తున్నాడో తెలుసుకుంటున్నామని వివరించాడు. "హార్దిక్‌ మాకు చాలా కీలక ఆటగాడు. మేం ఫైనల్‌ చేరుకోవడంలో అతడి బ్యాటింగ్‌ మాకెంతో దోహదపడింది. అతడు ఇలాగే బ్యాటింగ్‌ చేస్తున్నంత వరకు మాకు సంతోషమే" అని హిట్‌మ్యాన్‌ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.