చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఓడి, నాలుగో ఓటమిని మూటగట్టుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓడిపోవడమంటే, కాస్త కష్టమైన విషయమేనని మ్యాచ్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.
మేం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసు. వాటిని సరిదిద్దుకునేందుకు కష్టపడుతూనే ఉన్నాం. అయితే అమలు దగ్గరికొచ్చేసరికి పొరపాటు జరుగుతోంది. 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం మంచిదే అనుకున్నా. కానీ నా అంచనా తప్పయ్యింది. దీన్ని బట్టి శిక్షణ కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. కచ్చితంగా ఇప్పుడున్న దానికంటే రెట్టింపు జోరుతో తిరిగి వస్తాం"
కేఎల్ రాహుల్, పంజాబ్ కెప్టెన్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రాహుల్(63), పూరన్(33) బాగా ఆడారు. అనంతరం ఛేదనలో దిగిన చెన్నై అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు డుప్లెసిస్(87*), వాట్సన్(83*) అదరగొట్టారు. ఫలితంగా ధోనీ సేన సునాయాసంగా విజయం దక్కించుకుంది.