కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాల్సి ఉన్నా ఫుడ్ పాయిజన్ కావడం వల్ల కడుపు నొప్పితో ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే తాజాగా అతడు ఆ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో అతడు ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
"కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అభిమానులకు ఇది కచ్చితంగా శుభవార్త. ఓపెనర్ క్రిస్ గేల్ కడుపు నొప్పి నుంచి కోలుకుని మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు."
-ఫ్రాంచైజీ ట్వీట్
గేల్‌ను ఆడించకపోవడంపై అభిమానులు ఫ్రాంచైజీపై విమర్శలు చేశారు. వరుసగా ఓడిపోతున్నా ఎందుకు గేల్‌ను ఆడించట్లేదంటూ ప్రశ్నించారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోచ్ అనిల్ కుంబ్లే దానిపై వివరణ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఆడాల్సి ఉన్నా ఫుడ్ పాయిజన్ కావడం వల్ల బరిలో దిగలేదని వెల్లడించాడు.