ETV Bharat / sports

యార్కర్​ మెషిన్ నటరాజన్​:​ టెన్నిస్​ బంతి నుంచి ఈ​ స్థాయికి

తమిళనాడులోని మారుమూల పల్లె నుంచి వచ్చి, ప్రస్తుత ఐపీఎల్​లో తన అత్యద్భుత బౌలింగ్​తో అదరగొడుతున్నాడు. యార్కర్ల​తో దిగ్గజ క్రికెటర్ల మెప్పు పొందుతున్నాడు. ఇంతకీ అతడెవరు? అతడి సంగతేంటి?

From Tennis Ball cricket to yorker machine for Sunrisers Hyderabad - The inspiring story of T Natarajan
యార్కర్స్​ మెషిన్​:​ టెన్నిస్​ బంతి నుంచి వైట్​ బాల్​ స్థాయికి
author img

By

Published : Sep 30, 2020, 2:01 PM IST

Updated : Sep 30, 2020, 2:10 PM IST

క్రికెట్​కు సంబంధించి ఎలాంటి సదుపాయలు లేని తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన చిన్నప్పంపట్టి అనే కుగ్రామంలో జన్మించాడు తంగరాసు నటరాజన్​. ఆ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన తమిళనాడు ప్రీమియర్​ లీగ్​లో చోటు దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బౌలింగ్​తో అదరగొట్టాడు.​ ఈ లీగ్​లో యార్కర్ల స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటరాజన్​.. ఐపీఎల్​లో అడుగుపెట్టి, అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అరంగేట్ర సీజన్(2017)​లో తడబడినా.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు తన బౌలింగ్​తో దిగ్గజ క్రికెటర్ల మెప్పు పొందుతున్నాడు. ఈ సందర్భంగా 'యార్కర్ మెషిన్​' నటరాజన్​ జీవిత విశేషాలు.

ఐపీఎల్​ అరంగేట్రం

తమిళనాడు ప్రీమియర్​ లీగ్​లో అడుగుపెట్టి అభివన్​ ముకుంద్​, వాషింగ్టన్ సుందర్​ లాంటి బ్యాట్స్​మెన్​ను యార్కర్లతో కట్టడి చేసి, విజయం సాధించాడు. ఈ టోర్నీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో 2017 ఐపీఎల్​కుగానూ వేలంలో రూ.3 కోట్లకు పంజాబ్​ జట్టు నటరాజన్​ను సొంతం చేసుకుంది. ఆ ఏడాది ఆరు మ్యాచ్​లాడిన సరే 9 పైగా ఎకానమీతో పరుగులిచ్చి, అనుకున్నంతలా మెప్పించలేకపోయాడు.

సీనియర్ల మెప్పు

ఐపీఎల్​ 2018 సీజన్​లో ముత్తయ్య మురళీథరన్​ ప్రోద్బలంతో సన్​రైజర్స్​ హైదరాబాద్​లో చోటు దక్కించుకున్నాడు. కేవలం రూ.40 లక్షలకే ఇతడిని సొంతం చేసుకుంది. అప్పటికే భువనేశ్వర్​​, రషీద్​ ఖాన్​ లాంటి స్టార్​ బౌలర్లు ఉండటం వల్ల చివరి రెండు సీజన్లలో నటరాజన్​కు ఆడే అవకాశం లభించలేదు. ఈసారి అవకాశం లభించిన తొలి మ్యాచ్​లోనే స్టార్ బ్యాట్స్​మన్ కోహ్లీ వికెట్ తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దిల్లీ క్యాపిటల్స్​పై డెత్​ ఓవర్లలో అద్భుత యార్కర్లు వేసి మ్యాచ్​ను గెలిపించాడు. వీరేంద్ర సెహ్వగ్​, రికీ పాంటింగ్​, వీవీఎస్​ లక్ష్మణ్​, బ్రెట్​లీ లాంటి దిగ్గజాల పొగడ్తలు అందుకున్నాడు.

From Tennis Ball cricket to yorker machine for Sunrisers Hyderabad - The inspiring story of T Natarajan
దిల్లీ క్యాపిటల్స్​ తో జరిగిన మ్యాచ్​లో ఏడు యార్కర్లు వేసిన నటరాజన్

విలాసాల కంటే చదువే ముఖ్యం

తన సంపాదనంతా, తన సోదరీమణుల చదువు కోసమే ఉపయోగిస్తానని గతంలోని ఓ ఇంటర్వ్యూలో నటరాజన్ చెప్పాడు. విలాసాల కంటే చెల్లెళ్ల చదువే ముఖ్యమని అన్నాడు.

"ముందుగా నేను కనీస అవసరాలను తీర్చుకోవాలి. ఆ తర్వాతే విలాసాల గురించి ఆలోచిస్తాను. నా చెల్లెళ్లను బాగా చదివించాలి. వారి కాళ్లపై వారు నిలబడే వరకు నా సహకారాన్ని అందించాలి. ఖరీదైన కారులో తిరగడం కన్నా.. నా సోదరిమణలు చదువే నాకు ముఖ్యం" అని తెలిపాడు నటరాజన్.

Last Updated : Sep 30, 2020, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.