ETV Bharat / sports

చెన్నైXబెంగళూరు: గెలుపు బాట పట్టేదెవరు? - చెన్నై vs​ బెంగళూరు మ్యాచ్​ ప్రివ్యూ

దుబాయ్​ వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, చెన్నై సూపర్​కింగ్స్ మధ్య నేడు మ్యాచ్​ జరగనుంది. ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో భారత జట్టు కెప్టెన్లు విరాట్​ కోహ్లీ, మహేంద్రసింగ్​ ధోనీ తొలిసారి తలపడనున్నారు. ఈ మ్యాచ్​లో విజయం సాధించి టోర్నీలో తమ మనుగడను సాగిద్దామని ఇరుజట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Focus on CSK's batting struggles as Dhoni's men take on RCB
చెన్నై Vs బెంగళూరు: ఇద్దరు కెప్టెన్లలో ఆధిపత్యం ఎవరిది?
author img

By

Published : Oct 10, 2020, 5:29 AM IST

టీమ్​ఇండియాకు కెప్టెన్​గా వ్యవహరించిన అనుభవం ఉన్న స్టార్ ఆటగాళ్లు ధోనీ, విరాట్​ కోహ్లీ.. ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో తొలిసారి తలపడబోతున్నారు. శనివారం దుబాయ్​ వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​, రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ రెండు జట్లు టోర్నీలో స్థిరమైన విజయాల కోసం పోరాటం సాగిస్తున్నాయి.

జాదవ్​కు ఛాన్స్​ లేనట్టే!

కోల్​కతా నైట్​రైడర్స్​ చేతిలో ఓటమి తర్వాత చెన్నై సూపర్​కింగ్స్​ ఆల్​రౌండర్​ కేదార్​ జాదవ్​ను బెంచ్​కు పరిమితం చేసే అవకాశం ఉంది. కేకేఆర్​పై కేవలం 10 పరుగుల తేడాతో ధోనీసేన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్​లో కేదార్​ జాదవ్​ డెత్​ ఓవర్లలో ఎక్కువ బంతుల్లో సరైన పరుగులు రాబట్టకపోవడం వల్లే చెన్నై ఓటమి చెందిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సీఎస్కే ఓపెనర్లు బలంగా ఉన్నప్పటికీ మిడిల్​ ఆర్డర్​ వైఫల్యం చెందుతూనే ఉంది. కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ ఫామ్​లో లేడు. ఒకవేళ జాదవ్​ స్థానంలో రుతురాజ్​ గైక్వాడ్ లేదా 2018 నుంచి బెంచ్​కు పరిమితమైన ఎన్​ జగదీశన్​కు తుదిజట్టులో చేర్చుకునే అవకాశం ఉంది.

బ్యాటింగ్​లో కొంత కలవరం ఉన్నప్పటికీ.. సీఎస్కే బౌలింగ్​ లైనప్​ చాలా మెరుగ్గా ఉంది. కోల్​కతాపై మ్యాచ్​లో బ్రావో అద్భుతంగా రాణించాడు. పీయూష్​ చావ్లా స్థానంలో ఎంపికైన స్పిన్నర్​ కరన్​ శర్మ.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇంకా దీపక్​ చాహర్, సామ్​ కరన్​, శార్దూల్ ఠాకూర్​ మంచి ప్రదర్శన చేస్తున్నారు.

ఆర్సీబీ బలమైన బ్యాటింగ్​ లైనప్​

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ తిరిగి ఫామ్​లోకి వచ్చాడు. దీంతో ఓపెనర్లు ఆరోన్​ ఫించ్​, దేవ్​దత్ పడిక్కల్​తో పాటు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి అద్భుత బ్యాటింగ్​ లైనప్​తో ఉంది ఆర్సీబీ. దిల్లీ క్యాపిటల్స్​పై పరాజయం చవిచూసినప్పటికీ.. సీఎస్కే మ్యాచ్​లో తిరిగి రాణించాలని ఆర్సీబీ యోచిస్తోంది.

బౌలింగ్​ లైనప్​లో లెగ్​-స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​, వాషింగ్టన్​ సుందర్​లు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ, ఉమేశ్​ యాదవ్​, మహ్మద్ సిరాజ్​, నవదీప్ సైని వంటి బౌలర్లు ప్రత్యర్థులకు ఎక్కువ పరుగులను సమర్పిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఇసురు ఉదానా చేరికతో బౌలింగ్​ లైనప్​ మరింత బలంగా మారింది.

దుబాయ్​ వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటల 30 నిమిషాలకు ప్రారంభంకానుంది.

జట్ల అంచనా:

చెన్నై సూపర్​కింగ్స్: యంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్​ కీపర్​), మురళీ విజయ్, అంబటి రాయుడు, ఫాఫ్ డు ప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, లుంగీ ఎంగిడి, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, ఇమ్రాన్ తాహిర్, జోష్ హెజిల్‌వుడ్, శార్దుల్ ఠాకూర్, సామ్ కరన్​, ఎన్ జగదీశన్, కెఎమ్ ఆసిఫ్, మోను కుమార్, ఆర్ సాయి కిషోర్, రుతురాజ్ గైక్వాడ్, కరన్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబి డివిలియర్స్, పార్థివ్ పటేల్, ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్, క్రిస్ మోరిస్, మొయిన్ అలీ, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, దేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, డేల్ స్టెయిన్, ఇసురు ఉదానా, శివం దుబే, ఉమేశ్​ యాదవ్, గుర్కీరత్ సింగ్ మన్, వాషింగ్టన్ సుందర్, పవన్ దేశ్‌పాండే, ఆడమ్ జంపా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.