ETV Bharat / sports

'ఓ ఘట్టం ముగిసింది.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' - షేన్​ వాట్సన్​ రిటైర్మెంట్​

ఆస్ట్రేలియా క్రికెటర్​ షేన్​ వాట్సన్​ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. తన కలను సాకారం చేయడానికి సాయపడిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్​ చేశాడు.

Shane Watson
వాట్సన్​
author img

By

Published : Nov 3, 2020, 3:18 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితమే ఇతడు అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలకగా.. తాజాగా లీగ్​ల నుంచీ తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. కెరీల్​లో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశాడు.

"ఓ అద్భుత ఘట్టం ముగిసింది. నా జీవితంలోని రెండో ఘట్టంలోకి అడుగుపెడుతున్నందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నా. నా కలలను సాకారం చేసుకోవడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు. ఓ కలతో నా కెరీర్​ ప్రారంభమైంది. నా ఐదేళ్ల వయసులో టెస్టు మ్యాచులు చూసేవాడిని. అప్పుడు మా అమ్మగారికి ఆస్ట్రేలియా తరపున క్రికెట్​ ఆడాలని చెప్పేవాడిని. ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి ఏకంగా రిటైర్మెంట్​ ప్రకటించా. నా కలను సాకారం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదంతా చూస్తుంటే భలే ఉంది. నా చివరి మ్యాచ్​ను సీఎస్కే తరఫున ఆడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గత మూడేళ్ల నుంచి చెన్నై జట్టు నన్ను చాలా బాగా చూసుకుంది."

-వాట్సన్​, ఆస్ట్రేలియా క్రికెటర్​.

2002లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన వాట్సన్​.. కెరీర్​లో 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20 ఆడి.. మొత్తంగా 14 వేల పరుగులు చేశాడు.

ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, చెన్నై సూపర్​ కింగ్స్​ తరఫున మొత్తంగా 145 మ్యాచులు ఆడాడు వాట్సన్​. 2008, 2018లో ట్రోఫీని సొంతం చేసుకున్న రాయల్స్​, చెన్నై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2008, 2013లో మ్యాన్​ ఆఫ్​ ధి టోర్న్​మెంట్​ అవార్డును అందుకున్నాడు. మొత్తంగా లీగ్​ చరిత్రలో 137.91 స్ట్రైక్​ రేట్​తో 3,874 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు చేసి 92 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్​లో 11 మ్యాచ్​లు ఆడిన వాట్సన్ 299 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇదీ చూడండి అన్ని ఫార్మాట్లకు వాట్సన్ రిటైర్మెంట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.