ఐపీఎల్లో గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కోల్‌కతా బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్, అంపైర్ షంషుద్దీన్ మధ్య తెలుగులో సంభాషణ జరిగింది. సీఎస్కే బౌలర్ సామ్ కరన్ వేసిన బంతిని ఎదుర్కొన్న కార్తిక్.. 'వైడ్ కాదా..?' అని అంపైర్‌ను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన అంపైర్ షంషుద్దీన్.. 'లోపల.. చానా లోపల.. కొంచెం కూడా కాదు' అని చెప్పాడు. వీరిద్దరి మధ్య జరిగిన తెలుగు సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన దినేశ్ కార్తిక్‌కు తెలుగు వచ్చా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
-
When our #Hyderabadi umpire responds in Telugu! Cheers Shamshu! #IPL2020 #CSKvKKR pic.twitter.com/pn3YmngRnq
— Venkat Parthasarathy (@Venkrek) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">When our #Hyderabadi umpire responds in Telugu! Cheers Shamshu! #IPL2020 #CSKvKKR pic.twitter.com/pn3YmngRnq
— Venkat Parthasarathy (@Venkrek) October 29, 2020When our #Hyderabadi umpire responds in Telugu! Cheers Shamshu! #IPL2020 #CSKvKKR pic.twitter.com/pn3YmngRnq
— Venkat Parthasarathy (@Venkrek) October 29, 2020