ఐపీఎల్ చరిత్రలో ధోనీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టోర్నీలో 200 మ్యాచ్‌ల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. ఇతడి తర్వాత రోహిత్ శర్మ(197 మ్యాచ్‌లు), రైనా(193), దినేశ్ కార్తిక్(191) ఉన్నారు. ఈ లీగ్‌లో సీఎస్కే తరఫున 4వేల పరుగులు పూర్తి చేశాడు ధోనీ.
-
Our Most Special #Thala gets to a super special number. 🦁💛 #WhistlePodu #WhistleFromHome #Yellove #CSKvRR pic.twitter.com/IcFvgwWVvr
— Chennai Super Kings (@ChennaiIPL) October 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our Most Special #Thala gets to a super special number. 🦁💛 #WhistlePodu #WhistleFromHome #Yellove #CSKvRR pic.twitter.com/IcFvgwWVvr
— Chennai Super Kings (@ChennaiIPL) October 19, 2020Our Most Special #Thala gets to a super special number. 🦁💛 #WhistlePodu #WhistleFromHome #Yellove #CSKvRR pic.twitter.com/IcFvgwWVvr
— Chennai Super Kings (@ChennaiIPL) October 19, 2020
2008 నుంచి చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. 2015 వరకు ప్రతి మ్యాచ్ ఆడాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో ఈ జట్టుపై రెండేళ్లు(2016-17) నిషేధం విధించిన సమయంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు.
ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై జట్టు.. ప్రతి సీజన్లో ఫ్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మూడుసార్లు ట్రోఫీని ముద్దాడింది. గతేడాది ఫైనల్లో ముంబయి చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. మొత్తంగా చెన్నై తరఫున 169 మ్యాచ్‌లాడి 102 సార్లు జట్టును గెలిపించాడు.
ఇదీ చూడండి రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 126