తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది దిల్లీ క్యాపిటల్స్. మరోవైపు వరుస ఓటములతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడీ రెండు జట్లు మంగళవారం మ్యాచ్‌లో తలపడనున్నాయి. తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల కల నెరవేర్చాలని సన్‌రైజర్స్, గెలుపు స్వారీ చేస్తూ మరింత వేగంగా దూసుకెళ్లాలని దిల్లీ భావిస్తున్నాయి.
దిల్లీ జట్టు
తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై, ఆ తర్వాత చెన్నైని ఓడించింది దిల్లీ క్యాపిటల్స్. సీఎస్కేతో మ్యాచ్‌లో పృథ్వీ షా(64), శిఖర్ ధావన్(35), రిషభ్ పంత్(37) అద్భుతంగా ఆడి, విజయంలో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చక్కగా బ్యాటింగ్ చేశాడు. పేసర్లు రబాడ, అన్రిచ్తో పాటు స్పిన్నర్లు అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాలతో జట్టు బలంగా ఉంది. తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న అశ్విన్.. ఈరోజూ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.
-
ⓇⒶⓇⒾⓃⒼ ⓉⓄ ⒼⓄ 🔥 @SDhawan25's record vs CSK 👌🏻@RishabhPant17's impressive strike rate 😎
— Delhi Capitals (Tweeting from 🇦🇪) (@DelhiCapitals) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Aiming for back-to-back wins 👊🏻
Here's your bitesize preview for #CSKvDC tonight!#Dream11IPL #IPL2020 #YehHaiNayiDilli pic.twitter.com/EoWo90vmgO
">ⓇⒶⓇⒾⓃⒼ ⓉⓄ ⒼⓄ 🔥 @SDhawan25's record vs CSK 👌🏻@RishabhPant17's impressive strike rate 😎
— Delhi Capitals (Tweeting from 🇦🇪) (@DelhiCapitals) September 25, 2020
Aiming for back-to-back wins 👊🏻
Here's your bitesize preview for #CSKvDC tonight!#Dream11IPL #IPL2020 #YehHaiNayiDilli pic.twitter.com/EoWo90vmgOⓇⒶⓇⒾⓃⒼ ⓉⓄ ⒼⓄ 🔥 @SDhawan25's record vs CSK 👌🏻@RishabhPant17's impressive strike rate 😎
— Delhi Capitals (Tweeting from 🇦🇪) (@DelhiCapitals) September 25, 2020
Aiming for back-to-back wins 👊🏻
Here's your bitesize preview for #CSKvDC tonight!#Dream11IPL #IPL2020 #YehHaiNayiDilli pic.twitter.com/EoWo90vmgO
హైదరాబాద్ జట్టు
ఈ ఏడాది భారీ అంచనాలతో బరిలో దిగిన ఫ్రాంచైజీల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో చివరివరకు పోరాడిన ఫలితం లేకుండా పోయింది. అనంతరం కోల్‌కతాకూ తలవంచక తప్పలేదు. జట్టులో వార్నర్, బెయిర్‌స్టో లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ.. సరిపోవట్లేదు. కేన్ విలియమ్సన్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. రషీద్‌ఖాన్, భువనేశ్వర్‌లతో బౌలింగ్ విభాగం బలంగానే కనిపిస్తోంది.
-
Things you love to see on a match day 💪 https://t.co/hz8lnaORmX
— SunRisers Hyderabad (@SunRisers) September 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Things you love to see on a match day 💪 https://t.co/hz8lnaORmX
— SunRisers Hyderabad (@SunRisers) September 26, 2020Things you love to see on a match day 💪 https://t.co/hz8lnaORmX
— SunRisers Hyderabad (@SunRisers) September 26, 2020
దిల్లీ క్యాపిటల్స్:
శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్, హెట్మయిర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, అన్రిచ్ నోర్ట్జ్, మోహిత్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్:
వార్నర్(కెప్టెన్), బెయిర్‌స్టో, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, మహ్మద్ నబీ, సాహా, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నటరాజన్