ETV Bharat / sports

'అయిపోయాం అనుకున్నా.. బౌలర్లు ఆదుకున్నారు'

రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్ అయ్యాక తమ స్కోరు తక్కువ అనిపించిందని దిల్లీ క్యాపిటల్స్​ సారథి శ్రేయస్​ అయ్యర్ అన్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్​లో తమ బౌలర్లు చెలరేగడం వల్ల విజయం సాధించగలిగామని అన్నాడు. తమ బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారని చెప్పాడు.

shreyas Ayyar
శ్రేయస్​ అయ్యర్​
author img

By

Published : Oct 10, 2020, 9:48 AM IST

శుక్రవారం రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో దిల్లీ ఐదో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆ సారథి కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ మాట్లాడుతూ తమ ప్రదర్శన సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌ అయ్యాక తమ స్కోర్‌ తక్కువేమో అనిపించిందని తెలిపాడు. కానీ రెండో ఇన్నింగ్స్​లో తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని అన్నాడు.

"రెండో ఇన్నింగ్స్‌లో మేం తిరిగి పుంజుకోవడం సంతోషాన్నిచ్చింది. మా స్కోర్‌ తక్కువని భావించాం కానీ తర్వాత వికెట్‌ నెమ్మదించింది. మా బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. తేమ కారణంగా టాస్‌ గెలిస్తే మేమూ మొదట బౌలింగే ఎంచుకునే వాళ్లం. అదృష్టం కొద్దీ రెండో ఇన్నింగ్స్‌లో రాణించాం. కెప్టెన్సీ విషయానికొస్తే బాగా ఆస్వాదిస్తున్నా. అందుకు కారణం మా ఆటగాళ్లు. వాళ్లెంతో మెరుగ్గా రాణించి పరిస్థితులను తేలిక చేస్తున్నారు. రోజు రోజుకూ మెరుగవ్వడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉంది. అయితే, ఏ మ్యాచ్‌ను కూడా తేలిగ్గా తీసుకోం. సరైన ప్రణాళికలు అమలు చేసి మంచి ఫలితాలు సాధించాలని ఉంది"

- శ్రేయస్‌, దిల్లీ క్యాపిటల్స్​ సారథి

మరోవైపు ఈ మ్యాచ్​లో తన ఆటతీరుపై మాట్లాడాడు దిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​. తొలి మ్యాచ్​లో భుజం గాయంతో ఆటకు దూరమ్యాక.. మళ్లీ ఈ మ్యాచ్​లో తిరిగి ఆడటం, బాగా ప్రదర్శన చేయడం సంతోషానిచ్చిందన్నాడు. ప్రస్తుతం తాను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నట్లు చెప్పాడు.

ఈ మ్యాచ్​లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ జట్టు 20 ఓవర్లలో 184/8 స్కోర్‌ సాధించింది. అనంతరం రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. దీంతో దిల్లీ 46 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఇదీ చూడండి షార్జా వేదికగా మహిళల మినీ ఐపీఎల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.