ETV Bharat / sports

ఆర్సీబీపై దిల్లీ విజయం.. రెండు జట్లూ ప్లేఆఫ్స్​కు - \IPL 2020 news

RCB won the toss and elected to bowl first
టాస్ గెలిచిన దిల్లీ.. బెంగళూరు బ్యాటింగ్
author img

By

Published : Nov 2, 2020, 7:02 PM IST

Updated : Nov 2, 2020, 10:53 PM IST

22:48 November 02

దిల్లీ విజయం.. ప్లేఆఫ్స్​కు దిల్లీ, ఆర్సీబీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించింది. రహానే (60), ధావన్ (54) అర్ధసెంచరీలతో చెలరేగి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. అయితే నెట్ రన్​రేట్ బాగుండటం వల్ల గెలిచిన దిల్లీతో పాటు ఓడిన బెంగళూరు కూడా ప్లేఆఫ్స్​కు అర్హత సాధించాయి. చివరి బెర్తు కోసం కోల్​కతా, సన్​రైజర్స్ పోటీపడనున్నాయి.

22:45 November 02

దిల్లీ గెలుపు కోసం 12 బంతుల్లో 15 పరుగులు

చివర్లో దిల్లీ తడబడుతోంది. రహానే 60 పరుగులు చేసి ఔటయ్యాడు. గెలుపు కోసం ఇంకా 12 బంతుల్లో 15 పరుగులు చేయాలి దిల్లీ.

22:38 November 02

లక్ష్యం దిశగా దిల్లీ

బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్​లో లక్ష్యం దిశగా వెళుతోంది దిల్లీ. ధావన్ (54) అర్ధశతకం చేసి ఔటయ్యాడు. రహానే మాత్రం 58 పరుగులతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

21:56 November 02

నిలకడగా దిల్లీ బ్యాటింగ్​

లక్ష్యఛేదనలో బరిలో దిగిన దిల్లీ బ్యాట్స్​మెన్​ అద్భుతంగా రాణిస్తున్నారు. 7 ఓవర్లు పూర్తయ్యే సమయానికి వికెట్​ నష్టపోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ధావన్​ (27), రహానె (24) ఉన్నారు. శ్రేయస్​ జట్టు గెలవాలంటే 78 బంతుల్లో 91 రన్స్​ చేయాల్సిఉంది.

21:27 November 02

జోరు మీద దిల్లీ

153 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం రెండు ఓవర్లకు వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. పృథ్వీ షా 9 పరుగులు చేసి ఔటైనా.. ధావన్ (10) చెలరేగి ఆడుతున్నాడు.

20:59 November 02

దిల్లీ లక్ష్యం 153

దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో బెంగళూరు బ్యాట్స్​మెన్ తడబడ్డారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది ఆర్సీబీ. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (50) అర్ధసెంచరీతో రాణించాడు. మిగిలిన వారిలో కోహ్లీ (29), డివిలియర్స్ (35) అంచనాల్ని అందుకోలేకపోయారు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. 

20:53 November 02

తడబడుతోన్న ఆర్సీబీ

ఆర్సీబీ బ్యాటింగ్​లో తడబడుతోంది. ప్రస్తుతం 18 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

20:34 November 02

పడిక్కల్ హాఫ్ సెంచరీ

ఆర్సీబీ దూకుడు పెంచింది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ లీగ్​లో మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్ధశతకం బాదాడు. ఈ సీజన్​లో ఇతడికిది నాలుగో హాఫ్ సెంచరీ. ప్రస్తుతం 15 ఓవర్లకు 103 పరుగులు చేసింది ఆర్సీబీ.

20:28 November 02

నెమ్మదించిన ఆర్సీబీ బ్యాటింగ్

బెంగళూరు ఇన్నింగ్స్​ నెమ్మదిగా సాగుతోంది. ఈ మ్యాచ్​లో కెప్టెన్ కోహ్లీపై భారీ అంచనాలుండగా అందర్నీ నిరాశపరుస్తూ ఇతడు 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పడిక్కల్ (43) మరో హాఫ్ సెంచరీవైపు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం 14 ఓవర్లకు 90 పరుగులు చేసింది ఆర్సీబీ.

20:02 November 02

నిలకడగా ఆర్సీబీ బ్యాటింగ్

బెంగళూరు కాస్త జోరు పెంచింది. ప్రస్తుతం 7 ఓవర్లకు వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. ఫిలిప్ 12 పరుగులు చేసిన ఔటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. పడిక్కల్ (26) నిలకడగా ఆడుతున్నాడు.

19:36 November 02

నెమ్మదిగా బెంగళూరు బ్యాటింగ్

దిల్లీతో జరుగుతున్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న బెంగళూరు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఫిలిప్ (5), దేవదత్ (5) ఆచితూచి ఆడుతున్నారు. ఫలితంగా రెండు ఓవర్లకు 10 పరుగులు చేసిందీ జట్టు.

19:08 November 02

జట్లు

దిల్లీ క్యాపిటల్స్

శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పంత్, స్టోయినిస్, డేనియర్ సామ్స్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, రబాడ, ఎన్రిచ్ నోకియా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఫిలిప్, దేవదత్ పడిక్కల్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, షహబాజ్ అహ్మద్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదానా, సిరాజ్, చాహల్

18:31 November 02

బెంగళూరు బ్యాటింగ్

ఐపీఎల్ లీగ్ మ్యాచ్​లు తుదిదశకు చేరుకున్నాయి. ప్లేఆఫ్స్​లో చోటు కోసం పోటీ మరింత రసవత్తరంగా మారింది. అగ్రస్థానంలో ముంబయి ఇండియన్స్​ ఇప్పటికే అర్హత సాధించగా.. రెండో స్థానం కోసం బెంగళూరు, దిల్లీ మధ్య పోటీ నెలకొంది. సోమవారం జరిగే మ్యాచ్​లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముఖ్యంగా రెండో స్థానంలో పాగా వేసేందుకు వీళ్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఓడినా ప్లేఆఫ్స్ అవకాశం ఉంటుంది. కానీ మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. రెండు జట్లూ వరుస ఓటములతో డీలాపడ్డాయి. దీంతో ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఉన్నాయి. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.

Last Updated : Nov 2, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.