ETV Bharat / sports

చెన్నైపై రాజస్థాన్ అద్భుత విజయం - ఐపీఎల్ లైవ్

CSK vs RR
చెన్నై vs రాజస్థాన్
author img

By

Published : Oct 19, 2020, 6:54 PM IST

Updated : Oct 19, 2020, 10:53 PM IST

22:52 October 19

చెన్నై సూపర్​కింగ్స్​పై రాజస్థాన్ రాయల్స్.. 7 వికెట్ల తేడాతో గెలిచి ఫ్లేఆఫ్ ఆశల్ని సజీవం చేసుకుంది. సీఎస్కే ఇచ్చిన 126 పరుగుల లక్ష్య ఛేదనను మరో 2.3 ఓవర్లు మిగిలుండగానే పూర్తి చేసింది. జాస్ బట్లర్(70*) విజయంలో కీలక పాత్ర పోషించాడు.​

22:44 October 19

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చేరువలో ఉంది. విజయానికి 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే చేయాలి. క్రీజులో బట్లర్, స్మిత్ ఉన్నారు. ఇప్పటికే ఆర్థశతకం చేశాడు బట్లర్.

22:15 October 19

ఛేదనలో తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది రాజస్థాన్ రాయల్స్. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న స్మిత్, బట్లర్.. ఆచితూచి ఆడుతున్నారు. 

21:53 October 19

ధాటిగా ఛేదనను ఆరంభించిన రాజస్థాన్ జట్టు.. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి 28/3తో ఉంది. క్రీజులో స్మిత్, బట్లర్ ఉన్నారు.

21:40 October 19

126 పరుగుల లక్ష్య ఛేదనను ధనాధన్ బ్యాటింగ్​తో ప్రారంభించింది రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్లు స్టోక్స్, ఉతప్ప.. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 19 పరుగులు చేసిన స్టోక్స్.. చాహర్ బౌలింగ్​లో ఔటయ్యాడు. దీంతో మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది.

21:08 October 19

చాలా నెమ్మదిగా ఆడిన చెన్నై సూపర్​కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. సామ్ కరన్ 22, ధోనీ 28, జడేజా 35 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, త్యాగి, గోపాల్, తెవాతియా తలో వికెట్ తీశారు.

20:38 October 19

నాలుగు వికెట్లు కోల్పోవడం వల్ల ఆచితూచి ఆడుతోంది చెన్నై జట్టు. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 89 పరుగులే చేసింది. క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు.

20:21 October 19

చెన్నై బ్యాట్స్​మెన్స్​ను రాజస్థాన్​ బౌలర్లు కట్టడి చేస్తున్నారు. రాహుల్​ తివాతియా బౌలింగ్​లో రాయుడు(13) ఔట్​ అయ్యాడు. దీంతో 11 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(3), ధోనీ(4) ఉన్నారు. 

20:08 October 19

ఎనిమిది ఓవర్లో శ్రేయస్​ గోపాల్​ బౌలింగ్​లో సామ్​ కరణ్​(22) షాట్​కు యత్నించి జాస్​ బట్లర్​ చేతికి చిక్కాడు. దీంతో 8.2 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 53పరుగులు చేసింది సీఎస్కే. క్రీజులోకి అంబటి రాయుడు(12) ఉన్నాడు. మరొకరు రావాల్సి ఉంది. 

19:50 October 19

ఆచితుచి ఆడుతోన్న  చెన్నై జట్టును రాహుల్​ తెవాతియా దెబ్బతీశాడు.  త్యాగీ వేసిన బౌలింగ్​ వాట్సన్​(8) కొట్టిన షాట్​ను క్యాచ్​ పట్టుకున్నాడు. దీంతో 4.1 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది సీఎస్కే. క్రీజులోకి రాయుడు(4)వచ్చాడు. సామ్​ కరణ్​(15) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. 

19:43 October 19

చెన్నై తొలి వికెట్​ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్​ బౌలింగ్​లో డుప్లెసిస్​(10) షాట్​కు యత్నించి జాస్​ బట్లర్​ చేతికి చిక్కాడు. దీంతో 3.1 ఓవర్లకు స్కోరు 13గా ఉంది. క్రీజులో షేన్​ వాట్సన్​ వచ్చాడు. సామ్​ కరణ్​(8) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. 

19:39 October 19

టాస్ గెలిచిన చెన్నై జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. 2 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి కోల్పోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో కరన్, డుప్లెసిస్ ఉన్నారు.

19:12 October 19

ఐపీఎల్ చరిత్రలో ధోనీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టోర్నీలో 200 మ్యాచ్​ల మార్క్​ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్​కింగ్స్ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. ఇతడి తర్వాత రోహిత్ శర్మ(197 మ్యాచ్​లు), రైనా(193), దినేశ్ కార్తిక్(191) ఉన్నారు.

19:02 October 19

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్ ధోనీ. దీంతో బౌలింగ్ దాడిని ప్రారంభించనుంది రాజస్థాన్ రాయల్స్.

జట్లు

చెన్నై: డుప్లెసిస్, వాట్సన్, రాయుడు, ధోనీ(కెప్టెన్), జడేజా, జాదవ్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకుర్, చావ్లా, హేజిల్​వుడ్

రాజస్థాన్: స్టోక్స్, ఉతప్ప, సంజూ శాంసన్, స్మిత్(కెప్టెన్), బట్లర్, రియాన్ పరాగ్, తెవాతియా, ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్​పుత్, కార్తిక్ త్యాగి

18:43 October 19

గెలిచి నిలిచేది ఎవరు?

అబుదాబి వేదికగా చెన్నై సూపర్​కింగ్స్, రాజస్థాన్ రాయల్స్​ మధ్య ఈరోజు మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఏడున్నరకు ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు ఫ్లే ఆఫ్స్​కు వెళ్లే అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. ఓడితే ఇంటిముఖం పడుతుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్ చివరి స్థానంలో, చెన్నై దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి?

Last Updated : Oct 19, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.