అభిమానుల భారీ అంచనాల మధ్య ఐపీఎల్ బరిలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిరాశపరుస్తోంది. ఓ వైపు లీగ్‌నుంచి కొంతమంది ఆటగాళ్లు తప్పుకోగా.. మరికొందరు గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫలితంగా స్కోరు బోర్డును చెన్నై పురగులు పెట్టించలేక ఓటమిపాలవుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఫ్రాంచైజీ అభిమానులకు తీపికబురు వినిపించారు. గాయపడిన రాయుడు.. తర్వాత మ్యాచ్‌లో ఆడనున్నట్లు తెలిపారు. మరోవైపు డ్వేన్ బ్రావో కూడా నెట్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు.
సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబయిపై రాయుడు బ్యాటింగ్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో అతడు లేనిలోటు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు రాయుడు రాకతో ఫ్రాంచైజీలో నూతనోత్సాహం కనిపించనుంది. మరోవైపు బ్రావో కూడా హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని విశ్వనాథన్ పేర్కొన్నారు.
ఏడు రోజుల విరామం అనంతరం సరికొత్త జోరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది ధోనీసేన. అక్టోబరు 2న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.