ETV Bharat / sports

ధనశ్రీని చూసి చాహల్​ రియాక్షన్​ ఏంటంటే? - Dhanashree Verma's Surprise chahal

తనకు కాబోయే భర్త, బెంగళూరు జట్టు ఆటగాడు చాహల్​కు సర్​ప్రైజ్​ ఇచ్చింది ధనశ్రీ. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది ఆర్సీబీ.

Yuzvendra Chahal
చాహల్​కు ధనశ్రీ సర్​ప్రైజ్
author img

By

Published : Oct 23, 2020, 8:46 PM IST

ఓ వైపు ఆడుతూనే మరోవైపు కాబోయే భార్య ధనశ్రీతో కలిసి సరదాగా గడుపుతున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్​ చాహల్​. అయితే ధనశ్రీ.. అక్టోబర్​ 11న దుబాయ్​ చేరుకుంది. అనంతరం కరోనా నిబంధనల ప్రకారం క్వారంటైన్​ పూర్తి చేసుకుని 17వ తేదీన రాజస్థాన్​ రాయల్స్​తో జరిగే మ్యాచ్​కు హాజరైంది.

అయితే ఈ మ్యాచ్ తర్వాత వెళ్లి చాహల్​ను కలుద్దామనుకుంది ధనశ్రీ. కానీ ఆ మ్యాచ్​కు ముందే అతడిని కలిసి సర్​ప్రైజ్​ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది ఆర్సీబీ ఫ్రాంచైజీ. 'చాహల్​ నవ్వు వెనుక కారణం ఇదే' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది.

ఇందులో ధనశ్రీ.. తాను వస్తున్నట్లు చెప్పకుండా చాహల్​​ గది దగ్గరకు వెళ్లి తలుపు తట్టింది. వెంటనే తలుపు తీసిన చాహల్​.. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. అనంతంర పెద్ద నవ్వుతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. చాలా కాలం తర్వాత ఓ వ్యక్తి తన గది తలుపును తట్టారని చెప్పాడు చాహల్​. దీంతో పాటే తాను ముందుగానే స్పేచ్ఛను (పెళ్లికి ముందే) కోల్పోతున్నట్లు సరదాగా అన్నాడు.

ఇప్పటివరకు ఆడిన పది మ్యాచుల్లో చాహల్​ 15 వికెట్లు పడగొట్టాడు. అక్టోబర్​ 25న చెన్నై జట్టుతో తలపడనుంది ఆర్సీబీ.

ఇదీ చూడండ నేను ప‌ట్టింద‌ల్లా బంగార‌మే: ధావ‌న్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.