చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా అర్ధాంతరంగా తప్పుకున్నాడు భువీ. దీని తర్వాత ఈ గాయం గురించి ఇప్పుడే చెప్పలేమని వెల్లడించాడు కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే పరీక్షల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు భువీ. దీంతో బౌలింగ్ విభాగంలో సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బ తగిలినట్లైంది.
ఏం జరిగింది
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్ బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్.. తొడభాగం గాయపడటం వల్ల ఓవర్ మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. మొదట నొప్పి వచ్చినప్పుడు వైద్యుడి సాయంతో కాస్త కోలుకున్నట్లు కనిపించాడు. తిరిగి బౌలింగ్ వేసేందుకు ప్రయత్నించగా మళ్లీ నొప్పి మొదలవ్వడం వల్ల మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ మిగిలిన ఓవర్‌ను పూర్తిచేశాడు.
ఈ టోర్నీలో సన్‌రైజర్స్‌కు ఇదో రెండో దెబ్బ. ఇప్పటికే గాయం కారణంగా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ టోర్నీకి దూరమయ్యాడు. ఇతడి స్థానంలో జాసన్ హోల్డర్‌ను తీసుకుంది యాజమాన్యం.