ETV Bharat / sports

బౌలర్ల జోరు.. రసవత్తరంగా ఐపీఎల్ పోరు​ - మహ్మద్​ షమి వార్తలు

ఐపీఎల్​ ప్రారంభం నుంచి బ్యాట్స్​మెన్​ హవానే కొనసాగేది. కానీ యూఏఈ వేదికగా జరుగుతున్న ప్రస్తుత సీజన్​లో మాత్రం బౌలర్లూ​ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వరుస సూపర్​ ఓవర్లే.. బ్యాటుకు, బంతికి మధ్య పోటీకి సాక్ష్యం. ఈ పోటీ క్రికెట్​ అభిమానులకు మరింత కిక్​ ఇస్తోంది. ​

Along with the batsmen, the bowlers are doing well in the ongoing IPL in the UAE
అదిరిపోయేలా.. బౌలర్లు చెలరేగాలా!
author img

By

Published : Oct 20, 2020, 7:24 AM IST

ఇప్పుడంతా బ్యాట్స్‌మెన్‌దే రాజ్యం. ఒక ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉన్నా.. బౌలింగ్‌ జట్టు గెలుస్తుందన్న గ్యారెంటీ లేని రోజులువి. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ అయినా.. సూపర్‌ ఓవర్‌ అయినా బ్యాట్స్‌మెన్‌ విధ్వంసాలే చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో సూపర్‌ ఓవర్లో ఒక బౌలర్‌ 2 వికెట్లు తీసి 2 పరుగులకే అవతలి జట్టును పరిమితం చేస్తే.. మరో బౌలర్‌ ఓవర్లో 5 పరుగులకే రెండు వికెట్లు పడగొడితే.. తర్వాత అవతలి జట్టు బౌలర్‌ అన్నే పరుగులిచ్చి సూపర్‌ ఓవర్‌ను టైగా మారిస్తే..? ఈ ఆదివారం మధ్యాహ్నం వరకు ఇలాంటి గణాంకాల గురించి చెబితే నవ్వేవాళ్లేమో! కానీ ఆ రోజు రాత్రి ఈ అద్భుతాలే చోటు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలే ఐపీఎల్‌ను రసవత్తరంగా మార్చాయి.

కథ మారింది

90వ దశకంలో దక్షిణాఫ్రికాతో హీరో కప్‌ మ్యాచ్‌లో సచిన్‌ తెందుల్కర్‌ చివరి ఓవర్‌ను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. 2 వికెట్లు చేతిలో ఉన్న సఫారీ జట్టు 6 పరుగులు చేయాల్సి ఉంటే.. సచిన్‌ కేవలం రెండే పరుగులిచ్చి 3 పరుగుల తేడాతో భారత్‌ గెలిచేలా చేశాడా మ్యాచ్‌లో. అప్పట్లో ఇలా చివరి ఓవర్లో అయిదారు పరుగులు చేయలేక జట్లు ఓడిపోయిన సందర్భాలు ఎన్నో. అప్పుడు బ్యాటుకు, బంతికి మధ్య పోరు హోరాహోరీగా సాగేది. కానీ తర్వాతి కాలంలో కథ మారుతూ వచ్చింది. బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం పెరిగిపోయింది.

టీ20ల రాకతో, ముఖ్యంగా ఐపీఎల్‌ ఆగమనంతో బ్యాట్స్‌మెన్‌కు ఎదురు లేకుండా పోయింది. భారత్‌లో ఐపీఎల్‌ జరిగేపుడు ఎప్పుడూ బ్యాట్స్‌మెన్‌దే హవా. ఈసారి యూఈఏతో జరుగుతున్న లీగ్‌లోనూ ఆరంభ మ్యాచ్‌ల్లో బ్యాటు జోరే కనిపించింది. షార్జాలో అయితే బ్యాట్స్‌మెన్‌ పట్టపగ్గాల్లేకుండా కనిపించారు. 200 చేయడం తేలికైపోయింది. అంత కంటే పై లక్ష్యాన్నీ ఛేదించేశారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారాయి. బౌలర్లు పోటీలోకి వచ్చారు. 170 దాటితే భారీ స్కోరుగా మారిపోయింది. లక్ష్యం 160 దాటితే ఛేదన కష్టమైపోతోంది. ఇటు పేసర్లు, అటు స్పిన్నర్లు సమానంగా సత్తా చాటుతున్నారు.

ఇది కదా మజా అంటే..

సిక్సర్లు, ఫోర్ల మోత మోగిపోతే, పరుగుల వరద పారితే చూడ్డానికి ఉంటుంది కానీ.. బౌలర్లకు అసలు అవకాశమే లేకుండా పూర్తిగా బ్యాట్స్‌మెన్‌దే రాజ్యమైతే ఆటలో ఆసక్తేముంటుంది? మోతాదు ఎక్కువైతే దేనిపైన అయినా ఆసక్తి తగ్గిపోతుంది. పరుగుల విషయంలోనూ అంతే. షార్జాలో వరుసగా భారీ స్కోర్లు నమోదవుతుండటం వల్ల ఆ మ్యాచ్‌ల పట్ల ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. కానీ మిగతా మైదానాల్లో మాదిరే ఇక్కడా పిచ్‌లో మార్పు వచ్చింది. పరుగుల జోరు తగ్గింది. బ్యాటుకు, బంతికి మధ్య పోటీ పెరిగింది. ఆదివారం నాటి మ్యాచ్‌ల సంగతే తీసుకుంటే.. సూపర్‌ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ ఇష్టానుసారం బాదేసి ఉంటే ఆ మ్యాచ్‌లు అంత మజానిచ్చేవా? ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలర్ల అద్భుత ప్రతిభను చూశాం. భారీ షాట్లు లేకపోతేనేం వారి బంతులు కావాల్సినంత వినోదాన్నిచ్చాయి.

పంజాబ్‌తో మ్యాచ్‌లో, సూపర్‌ ఓవర్లో కళ్లు చెదిరే బంతులతో అబ్బురపరిచాడు బుమ్రా. రాహుల్‌ లాంటి మేటి బ్యాట్స్‌మన్‌ అతడి బంతికి షాట్‌ ఆడేందుకు విశ్వ ప్రయత్నం చేసి వికెట్ల ముందు దొరికిపోయి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లోనూ అద్భుతమైన యార్కర్‌తో రాహుల్‌ను బౌల్డ్‌ చేశాడు బుమ్రా. ఇక సూపర్‌ ఓవర్లో బుమ్రా 5 పరుగులే ఇచ్చాక మ్యాచ్‌ ముంబయి వశమైపోయినట్లే అని అంతా అనుకున్నాక.. షమి యార్కర్లతో ఆ జట్టు మేటి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించిన తీరు అమోఘం. సూపర్‌ ఓవర్లో 5 పరుగులను కాపాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. మ్యాచ్‌లో అసలైన మలుపు ఇదే. షమి ప్రతిభ వల్లే తర్వాత ఇంకో సూపర్‌ ఓవర్‌ ఆడాల్సిన పరిస్థితి తలెత్తింది.

అంతకుముందు సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా ఫాస్ట్‌బౌలర్‌ ఫెర్గూసన్‌ సైతం అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాటుకు బంతి సరైన పోటీ ఇస్తే మ్యాచ్‌లు ఎంత ఆసక్తికరంగా సాగుతాయనడానికి ఈ మ్యాచ్‌లు ఉదాహరణగా నిలిచాయి. పరిస్థితులు చూస్తుంటే మున్ముందు బంతి జోరు మరింత పెరిగేలా ఉంది. మరి ఈ సవాలును బ్యాట్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.