ఐపీఎల్ పన్నెండో సీజన్లో ముంబయి తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయం కారణంగా నుంచి నిష్క్రమించాడు న్యూజిలాండ్ పేసర్ ఆడం మిల్నే. అతడి స్థానంలో వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్‌ను తీసుకుంది ముంబయి జట్టు.
- విండీస్ తరఫున తొమ్మిది టెస్టులు, 16 వన్డేలు ఆడిన ఈ 26 ఏళ్ల యువ ఆటగాడు.. టెస్టుల్లో 25, వన్డేల్లో 24 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
ఈ కుడిచేతి వాటం పేసర్ ముంబయి బౌలింగ్‌కు మరింత బలంగా మారతాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఫ్రాంఛేజీ. ఇప్పటికే శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగ కూడా జట్టులో చేరాడు.
ముంబయి ఆడిన తొలి మ్యాచ్‌లోనే దిల్లీ చేతిలో ఓటమి చెందింది. ఈ రోజు బెంగళూరుతో తలపడనుండగా.. గత మ్యాచ్‌లో గాయపడిన బుమ్రా ఆడతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. కానీ ముంబయి యాజమాన్యం బుమ్రా నెట్ప్రాక్టీసు ఫొటోలు సోషల్‌మీడియాలో షేర్ చేసింది.