ఐపీఎల్-2019.. ఫైనల్లో అద్భుతంగా పోరాడి అందరి మనసులను గెల్చుకున్న షేన్ వాట్సన్ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్ ట్విట్టర్లో పంచుకుంది. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఈ వీడియోలో ధన్యవాదాలు తెలిపాడు వాట్సన్. వచ్చే ఏడాది చెన్నై తరపున మళ్లీ ఆడి, సత్తాచాటుతానని చెప్పాడు.
-
The most awaited video in the last 3 days is finally here! Get well soon, #WattoMan! Just can't wait for some #yellove T20 in 2020! @ShaneRWatson33 #KNEEngaVeraLevel #WhistlePodu 🦁💛 pic.twitter.com/ns5CokDbpT
— Chennai Super Kings (@ChennaiIPL) May 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The most awaited video in the last 3 days is finally here! Get well soon, #WattoMan! Just can't wait for some #yellove T20 in 2020! @ShaneRWatson33 #KNEEngaVeraLevel #WhistlePodu 🦁💛 pic.twitter.com/ns5CokDbpT
— Chennai Super Kings (@ChennaiIPL) May 16, 2019The most awaited video in the last 3 days is finally here! Get well soon, #WattoMan! Just can't wait for some #yellove T20 in 2020! @ShaneRWatson33 #KNEEngaVeraLevel #WhistlePodu 🦁💛 pic.twitter.com/ns5CokDbpT
— Chennai Super Kings (@ChennaiIPL) May 16, 2019
చెన్నై - ముంబయి మధ్య ఆదివారం జరిగిన ఫైనల్లో వాట్సన్ ఓంటరి పోరాటం చేశాడు. మోకాలికి గాయమైనా.. అర్ధశతకంతో అదరగొట్టాడు. రక్తమొస్తున్నా.. మైదానం వీడకుండా 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. వాట్సన్ పోరాట పటిమపై నెటిజన్లు విశేషంగా స్పందించారు.
ఈ మ్యాచ్‌లో చెన్నై ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ 2019 టైటిల్‌ను ముంబయి నాలుగోసారి కైవసం చేసుకుంది. ఇప్పటికి ఎనిమిది సార్లు ఫైనల్ చేరిన చెన్నై మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.