ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఐపీఎల్ చివరి మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. ఆసీస్ ప్రపంచకప్ జట్టులో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. జట్టులోని 15 మంది ఆటగాళ్లు మే 2న బ్రిస్బేన్ ట్రైనింగ్ క్యాంప్‌కు హాజరుకావాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది.
సన్‌రైజర్స్‌లో నిలకడగా రాణిస్తున్న డేవిడ్ వార్నర్ ఆ జట్టుకు ప్రధాన బలం. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది హైదరాబాద్. ప్లే ఆఫ్ చేరాలంటే మిగతా మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మే 2, 4 తేదీల్లో జరిగే ముంబయి, ఆర్సీబీ మ్యాచ్‌లకు వార్నర్ దూరం కానున్నాడు.
స్టీవ్ స్మిత్ రాజస్థాన్ జట్టులో కీలక సభ్యుడు. అతడు దూరమైతే రాయల్స్పైనా ప్రభావం పడనుంది.
-
JUST IN: Smith and Warner set for comeback; Finch to lead Australia at 2019 World Cup.
— Cricbuzz (@cricbuzz) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Squad: Finch (c), Khawaja, Warner, Smith, Shaun Marsh, Maxwell, Stoinis, Carey, Cummins (vc), Starc, Richardson, Coulter-Nile, Behrendorff, Lyon, Zampa
">JUST IN: Smith and Warner set for comeback; Finch to lead Australia at 2019 World Cup.
— Cricbuzz (@cricbuzz) April 15, 2019
Squad: Finch (c), Khawaja, Warner, Smith, Shaun Marsh, Maxwell, Stoinis, Carey, Cummins (vc), Starc, Richardson, Coulter-Nile, Behrendorff, Lyon, ZampaJUST IN: Smith and Warner set for comeback; Finch to lead Australia at 2019 World Cup.
— Cricbuzz (@cricbuzz) April 15, 2019
Squad: Finch (c), Khawaja, Warner, Smith, Shaun Marsh, Maxwell, Stoinis, Carey, Cummins (vc), Starc, Richardson, Coulter-Nile, Behrendorff, Lyon, Zampa
వీరితో పాటు ముంబయి ఆటగాడు జాసన్, బెంగళూరు క్రికెటర్ స్టాయినిస్‌లు ఆసిస్ ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. వీరూ ఐపీఎల్ చివరి మ్యాచ్‌లకు దూరం కానున్నారు. మే 2 నుంచి ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌తో మూడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.
ఇది చదవండి: ప్రపంచకప్ ఆసిస్ జట్టులో వార్నర్, స్మిత్