ETV Bharat / sports

ఆర్సీబీ వరుస ఓటములకు చెక్.. కోహ్లీ అమితానందం! - rcb next match date

సన్​రైజర్స్​ హైదరాబాద్​పై విజయం సాధించిన ఉత్సాహంలో బెంగళూరు జట్టు డ్రెస్సింగ్​ రూమ్​కి తిరిగొస్తూ సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలోనే అసలైన పునరాగమనం అంటే ఇదేనంటూ కోహ్లీ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది.

Virat Kohli
కోహ్లీ
author img

By

Published : Sep 22, 2020, 3:39 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

దుబాయ్​ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు అనూహ్య విజయం సాధించింది. ఈ క్రమంలోనే విరాట్​ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఆనందంతో డ్రెస్సింగ్​ రూమ్​కి తిరిగి వచ్చి.. గెలుపు సంబరాలు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. అసలైన పునరాగమనం అంటే ఇది అంటూ విరాట్​ కోహ్లీ సింహంలా గర్జించాడు. తన జట్టుకు ఈ విజయం ఎందుకంత ముఖ్యమో విరాట్​ వివరించాడు.

"ఆర్సీబీ తరఫున ఆడి వరుసగా ఆరు ఓటముల్లో భాగమైన వాళ్లకు ఈ విజయం ప్రాముఖ్యత తెలుస్తుంది. మేము 170 కంటే తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించాం. మంచు కారణంగా పిచ్​పై బౌలర్లకు చాలా కష్టమైంది. అయితే, ఇదే మైదానంలో కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​, దిల్లీ క్యాపిటల్స్​ జట్ల మ్యాచ్​ను మా ఆటగాళ్లు పరిశీలించారు. కాబట్టి, వాళ్లు మంచి ప్రదర్శన చేశారని అనుకుంటున్నా."

-కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్​

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్​ మాట్లాడుతూ.. "నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు 160 పరుగులు చేయాలని అనుకున్నా. అంతకంటే తక్కువ స్కోరు చేస్తే.. మాకు ఒత్తిడి తప్పదని అర్థమైంది. జట్టు సమష్టి కృషిపై చాలా సంతోషంగా ఉంది. చాహల్, దూబే​ అనూహ్య బౌలింగ్​ ప్రదర్శన కనబరిచారు" అని పేర్కొన్నాడు.

బెంగళూరు జట్టు తర్వాత మ్యాచ్​లో సెప్టెంబరు 24న కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్​తో తలపడనుంది.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.