రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కోల్‌కతా. బెంగళూరు మ్యాచ్‌లో ఓటమి అంచుల వరకు వెళ్లింది కోల్‌కతా. చివర్లో రసెల్ మెరుపులతో మ్యాచ్ నెగ్గింది. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌లో ఒక్కదాంట్లోనే గెలిచింది రాజస్థాన్. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. 3 మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదుంది కోల్‌కతా.
స్టోక్స్, బట్లర్, రహానే, సంజు శాంసన్‌లతో బలంగా ఉంది రాజస్థాన్. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్ ఆకట్టుకుంటున్నారు. కోల్‌కతా జట్టులో క్రిస్‌లిన్, నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, రసెల్, దినేశ్ కార్తీక్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
కోల్‌కతా ఓటమి వరకు చేరినా చివర్లో రసెల్ విధ్వంసం సృష్టించి గెలిపిస్తున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్(రాజస్థాన్) పదునైన బంతులను రసెల్ ఎలా ఎదుర్కుంటాడో వేచి చూడాలి.
జట్ల అంచనా..
కోల్‌కతా నైట్ రైడర్స్:
దినేశ్ కార్తిక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా, రసెల్, శుభ్‌మన్ గిల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ల్యూక్ ఫెర్గ్యుసన్, ప్రసిధ్ కృష్ణ.
రాజస్థాన్ రాయల్స్:
అజింక్య రహానే(కెప్టెన్), బట్లర్(కీపర్),స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బిన్ని, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, ధవల్ కులకర్ణి.