హైదరాబాద్‌లో సన్‌రైజర్స్, బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. రైజర్స్ ఓపెనర్లు చెలరేగి ఆడి బెంగళూరు ముందు 232 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. బెయిర్ స్టో, వార్నర్ సెంచరీలతో చెలరేగారు.
- 'సన్'ఓపెనర్ల విధ్వంసం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 16.2 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన వీరిద్దరూ 185 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 114 పరుగులు చేసిన బెయిర్ స్టో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. చివర వరకు క్రీజులో నిలిచిన వార్నర్... ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ నమోదు చేశాడు.
- తొలి ఐపీఎల్..తొలి సెంచరీ
అతడికిది తొలి ఐపీఎల్ సీజన్.. ఆడుతున్నది మూడో మ్యాచ్. అయినా ఎక్కడ తడబాటు లేకుండా ఆడాడు బెయిర్‌స్టో. ఈ టోర్నీలో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు.
- భాగస్వామ్యాల 'రికార్డు'
ఐపీఎల్లో రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు సన్‌రైజర్స్ ఓపెనర్లు. తొలి వికెట్‌కు 185 పరుగులు జోడించిన ఓపెనర్ జంటగా అరుదైన ఘనత సాధించారు.
- రైజర్స్ అత్యధిక స్కోరు ఇదే..
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈరోజు మ్యాచ్‌లో అత్యధికంగా 231 పరుగులు చేసింది. ఇప్పటి వరకు తమ జట్టు తరఫున ఉన్న 209 పరుగుల రికార్డును చెరిపేసుకుంది.
- బెంగళూరు బౌలింగ్ విఫలం..
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. చాహల్‌కు మాత్రమే ఒక వికెట్ దక్కింది. మరో వికెట్‌గా విజయ శంకర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. మిగతా బౌలర్లు వికెట్లేమి తీయలేకపోయారు.