దిల్లీతో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆలౌటైంది. వార్నర్(51), బెయిర్‌స్టో(41) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లతో విజృంభించగా... కీమో పాల్, మోరిస్‌లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. కీమో పాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రైజర్స్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి.
-
THREE. AWAY. WINS. IN. A. ROW. ♥#SRHvDC #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/jbiW54osNl
— Delhi Capitals (@DelhiCapitals) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">THREE. AWAY. WINS. IN. A. ROW. ♥#SRHvDC #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/jbiW54osNl
— Delhi Capitals (@DelhiCapitals) April 14, 2019THREE. AWAY. WINS. IN. A. ROW. ♥#SRHvDC #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/jbiW54osNl
— Delhi Capitals (@DelhiCapitals) April 14, 2019
156 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌కు మంచి ఆరంభం దక్కినా... సద్వినియోగ పరచుకోలేకపోయింది. బెయిర్ స్టో- వార్నర్ తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దిల్లీ బౌలర్ కీమో పాల్ 9వ ఓవర్లో బెయిర్ స్టోను వెనక్కి పంపగా.. కొద్దిసేపటికే విలియమ్స్న్నీ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. వార్నర్ నిలకడగా ఆడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబాడా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 16 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ జట్టు.
చుక్కలు చూపించిన రబాడ, పాల్, మోరిస్.
దిల్లీ బౌలర్లు రబాడా, పాల్, మోరిస్‌లు విజృంభించారు. నాలుగు వికెట్లతో రబాడ హైదరాబాద్‌కు విజయాన్ని దూరం చేశాడు. బెయిర్ స్టో, విలియమ్సన్, రికీ భుయ్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్న కీమో పాల్ సన్‌రైజర్స్‌ని కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం 18వ ఓవర్లో మూడు వికెట్ల తీసి సత్తా చాటాడు మోరిస్.
దిల్లీ బ్యాట్స్మెన్లలో శ్రేయాస్ అయ్యర్(45), కొలిన్ మున్రో(40), పంత్(23)లు రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ మూడు వికెట్లు తీయగా.. భువి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తరపున వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు భువనేశ్వర్.
-
.@DelhiCapitals are into double digits, jump into 2nd place on the points table!
— IndianPremierLeague (@IPL) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
#VIVOIPL pic.twitter.com/s3fohKdk4k
">.@DelhiCapitals are into double digits, jump into 2nd place on the points table!
— IndianPremierLeague (@IPL) April 14, 2019
#VIVOIPL pic.twitter.com/s3fohKdk4k.@DelhiCapitals are into double digits, jump into 2nd place on the points table!
— IndianPremierLeague (@IPL) April 14, 2019
#VIVOIPL pic.twitter.com/s3fohKdk4k