ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆదివారం కోల్‌కతాతో మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 43 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రస్తుత సీజన్‌లో 445 పరుగులు చేశాడు బెయిర్‌స్టో. తద్వారా ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు.
ఇంతకు ముందు ఈ రికార్డు 2015లో దిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (439 పరుగులు) పేరు మీద ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో డుప్లెసిస్(398-చెన్నై సూపర్ కింగ్స్, 2012), ఎల్. సిమ్మన్స్(394-ముంబయి ఇండియన్స్, 2014), ఆర్.త్రిపాఠి (391, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్-2017), లూయిస్ (382, ముంబయి ఇండియన్స్-2018) ఉన్నారు.
ఇవీ చదవండి: