ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఓడిపోయి దాదాపు ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు జల్లుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరుసగా మూడు పరాజయాలు అందుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ రెండింటి మధ్య నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
ఇంకొక్క మ్యాచ్‌లో ఓడితే బెంగళూరు ప్లే ఆఫ్‌కు చేరే అవకాశముండదు. కోల్‌కతా స్టార్ ఆటగాడు ఆండ్రీ రసెల్‌కు గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది. ఇది రైడర్స్ జట్టుకు ప్రతీకూలంగా మారనుంది. ఈ సీజన్లో బెంగళూరుతో జరిగిన తొలిమ్యాచ్‌లో రసెల్ 13 బంతుల్లో 48 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఇప్పటికే కోల్‌కతాపై ఓ మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఆ మ్యాచ్‌లో 206 పరగులు చేసిన బెంగళూరు.. రసెల్ విధ్వంసంతో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. కెప్టెన్ కోహ్లీ, డివిల్లియర్స్ ఫామ్‌లో ఉండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌లో మొయిన్ అలీ 32 బంతుల్లో 50 పరుగులు చేసి సత్తా చాటాడు. బౌలింగ్‌లో బలహీనంగా కనిపిస్తోంది కోహ్లీ సేన. గత మ్యాచ్‌లో గెలుపు ఖాయామనుకున్న దశలో పేలవ ప్రదర్శనతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ప్లే ఆఫ్ చేరాలంటే ఇప్పుడు నుంచి ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితుల్లో కోహ్లీ సేన ఒత్తిడి అధిగమించి సత్తాచాటాల్సి ఉంది. డేల్ స్టెయిన్ జట్టులో కలిసే అవకాశముంది. స్టెయిన్ రాకతో బౌలింగ్ విభాగం పటిష్ఠం కానుంది.
-
NOT #TBT. #SteynGun #OneDayToGo #PlayBold pic.twitter.com/pQJfFconcW
— Royal Challengers (@RCBTweets) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">NOT #TBT. #SteynGun #OneDayToGo #PlayBold pic.twitter.com/pQJfFconcW
— Royal Challengers (@RCBTweets) April 18, 2019NOT #TBT. #SteynGun #OneDayToGo #PlayBold pic.twitter.com/pQJfFconcW
— Royal Challengers (@RCBTweets) April 18, 2019
కోల్‌కతా నైట్ రైడర్స్...
చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్ ఈ సీజన్లో తొలిసారి విఫలమయ్యాడు. అనంతరం నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన రసెల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది. కోల్‌కతా పేసర్లు నిలకడగా రాణిస్తున్నారు. మొన్నటి వరకు చావ్లా, కుల్దీప్, నరైన్‌లతో స్పిన్ విభాగం పటిష్ఠంగా ఉందని భావించినా... ఈడెన్ పిచ్‌పై వికెట్లు తీయలేకపోతున్నారు. వారు సత్తా చాటాల్సిఉంది. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న దినేశ్ కార్తీక్‌పైనే అందరి చూపు ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్లో అంతగా ప్రభావం చూపని కార్తీక్ ప్రపంచకప్ ఎంపిక తర్వాత ఆడుతోన్న తొలిమ్యాచ్‌లో ఏ మేరకు ఆకట్టుకుంటాడో ఆసక్తిగా మారింది.
-
#KKRvRCB #KKRHaiTaiyaar pic.twitter.com/DQqLovOYVo
— KolkataKnightRiders (@KKRiders) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#KKRvRCB #KKRHaiTaiyaar pic.twitter.com/DQqLovOYVo
— KolkataKnightRiders (@KKRiders) April 18, 2019#KKRvRCB #KKRHaiTaiyaar pic.twitter.com/DQqLovOYVo
— KolkataKnightRiders (@KKRiders) April 18, 2019
జట్ల అంచనా..
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), మొయిల్ అలీ, ఏబీ డివిలియర్స్, అక్షదీప్ నాథ్. స్టాయినిస్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, చాహల్, మహమ్మద్ సిరాజ్, పవన్ నేగి
కోల్ కతా నైట్ రైడర్స్
సునీల్ నరైన్, దినేష్ కార్తీక్ (కెప్టెన్), పియూష్ చావ్లా, రాబిన్ ఊతప్ప, క్రిస్ లిన్, ఆండ్రీ రసెల్, కుల్దీప్ యాదవ్, నితీష్ రానా, ప్రసిద్ధ్ కృష్ణ, శుభమన్ గిల్, హారీ గుర్నే