ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు... అఫ్గాన్ జట్టును ఎంపిక చేశారు సెలక్టర్లు. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న అస్గర్‌పై వేటు వేసి గుల్బాదిన్ నైబ్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నిర్ణయంపై అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పందించాడు.
జట్టును ప్రస్తుత కెప్టెన్ బాగానే నడిపిస్తున్నాడని, మెగా టోర్నీ ముందు ఇలాంటి నిర్ణయం సరైనది కాదని అభ్యంతరం వ్యక్తం చేశాడు.
- మూడు ఫార్మాట్‌లకు వేర్వేరు సారథులు ఉండాలని సెలక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వన్డేలకు గుల్బాదిన్ నైబ్‌ను, టీ20లకు రషీద్ ఖాన్‌ను, టెస్టులకు రహమ్‌త్ షా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ప్రపంచకప్‌లో పాల్గొనే అఫ్గాన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా రషీద్ఖాన్నే ఎంపిక చేసింది బోర్డు. దీనికి కారణం కొంత కాలంగా అన్ని ఫార్మాట్లలోనూ రషీద్ అద్భుత ప్రదర్శన కనబరుస్తుండడమే.
ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఆఫ్గాన్ జట్టు... ఐర్లాండ్, స్కాట్లాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జూన్ 1న తలపడనుంది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో భాగస్వామ్యం వహించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది అఫ్గానిస్థాన్.