కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. జయపుర వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో స్టీవెన్ స్మిత్(73, 59 బంతుల్లో) అర్ధశతకంతో రాణించాడు. ఆరంభం నుంచి రాజస్థాన్ ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. చివర్లో స్మిత్ మెరుపులతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో హ్యారీ గుర్నే రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
-
Steve Smith remains unbeaten on 73 as the @rajasthanroyals end up with 139/3 after 20 overs.
— IndianPremierLeague (@IPL) April 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Is this enough to defend against the @KKRiders?#RRvKKR #VIVOIPL pic.twitter.com/C2CgqUxqO3
">Steve Smith remains unbeaten on 73 as the @rajasthanroyals end up with 139/3 after 20 overs.
— IndianPremierLeague (@IPL) April 7, 2019
Is this enough to defend against the @KKRiders?#RRvKKR #VIVOIPL pic.twitter.com/C2CgqUxqO3Steve Smith remains unbeaten on 73 as the @rajasthanroyals end up with 139/3 after 20 overs.
— IndianPremierLeague (@IPL) April 7, 2019
Is this enough to defend against the @KKRiders?#RRvKKR #VIVOIPL pic.twitter.com/C2CgqUxqO3
- టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఆరంభంలోనే రహానే(5) వికెట్ కోల్పోయింది. అనంతరం జాస్ బట్లర్- స్మిత్ జోడి మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడింది. అనంతరం బట్లర్(37, 34బంతుల్లో) గుర్నే చేతిలో ఔటయ్యాడు. కొద్ది సేపటికే రాహుల్ త్రిపాఠి (6) కూడా గుర్నే బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. స్టీవెన్ స్మిత్ నిలకడగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ ధాటిగా ఆడలేకపోయింది రాయల్స్ జట్టు.
మరోవైపు కోల్‌కతా బౌలర్లు వికెట్లు తీయకపోయినప్పటికీ పరుగుల వేగాన్ని తగ్గించారు. మంచి బంతులతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టారు. గుర్నే 2 వికెట్లు తీసి ఆకట్టుకోగా... ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.