సొంతగడ్డపై కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. ఓపెనర్లు ఇద్దరూ విఫలమైన వేళ మిడిలార్డర్ క్రీజులో నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగుల స్కోరు చేసింది. శామ్ కరన్ అర్ధసెంచరీతో రాణించాడు.
-
What a knock by Sam Curran (55)*👏👏. Propels the @lionsdenkxip total to 183/6 after 20 overs.
— IndianPremierLeague (@IPL) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Will this be enough to defend against #KKR? pic.twitter.com/Vrc5d49mpf
">What a knock by Sam Curran (55)*👏👏. Propels the @lionsdenkxip total to 183/6 after 20 overs.
— IndianPremierLeague (@IPL) May 3, 2019
Will this be enough to defend against #KKR? pic.twitter.com/Vrc5d49mpfWhat a knock by Sam Curran (55)*👏👏. Propels the @lionsdenkxip total to 183/6 after 20 overs.
— IndianPremierLeague (@IPL) May 3, 2019
Will this be enough to defend against #KKR? pic.twitter.com/Vrc5d49mpf
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న రాహుల్ 2 పరుగులకే వెనుదిరిగాడు. కొద్ది సేపటికే 14 పరుగులు చేసిన గేల్ కూడా ఔటయ్యాడు. వీరిద్దరి వికెట్లను కొత్త బౌలర్ సందీప్ వారియర్ తీశాడు.
నిలిచారు.. స్కోరు పెంచారు..
అనంతరం క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్ వికెట్లు పడకుండా ఆడారు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 48 పరుగులు చేసిన పూరన్‌ను నితీశ్ రానా ఔట్ చేశాడు. కొంతసేపటికే 36 పరుగులు చేసి మయాంక్ వెనుదిరిగాడు.
దంచేసిన కరన్
పంజాబ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ అదరగొట్టేశాడు. ఐపీఎల్లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. 24 బంతుల్లో 55 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో అశ్విన్ 0, ఆండ్రూ టై 0, మన్దీప్ 25 పరుగులు చేశారు.
కోల్‌కతా బౌలర్లలో సందీప్ వారియర్ రెండు వికెట్లు తీశాడు. హ్యారీ గుర్నే, రసెల్, నితీశ్ రానా తలో వికెట్ తీశారు.