ETV Bharat / sports

రోహిత్​సేన దిల్లీపై ప్రతీకారం తీర్చుకుంటుందా ?

ఫిరోజ్​షా కోట్లా వేదికగా దిల్లీ క్యాపిటల్స్​ - ముంబయి ఇండియన్స్ మధ్య నేడు మ్యాచ్​ జరగనుంది. ప్రపంచకప్​ జట్టులో చోటు దక్కని పంత్​ ఈ మ్యాచ్​లో ఎలా ఆకట్టుకుంటాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

పంత్ ప్రభావమా... రోహిత్​సేన ప్రతీకారమా
author img

By

Published : Apr 18, 2019, 7:27 AM IST

చెరో ఐదో విజయాలతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న దిల్లీ క్యాపిటల్స్​, ముంబయి ఇండియన్స్ మధ్య నేడు మ్యాచ్​ జరగనుంది. ఫిరోజ్​షా కోట్లా ఈ రసవత్తర పోరుకు వేదిక. ఈ సీజన్​లో దిల్లీతో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్​లో ఓడిపోయింది ముంబయి. ఇప్పుడు దిల్లీ వేదికగా ఆ జట్టుతో తలపడుతోంది. ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

  • వరుసగా రెండు మ్యాచ్​ల్లో గెలిచి ఊపు మీదుంది దిల్లీ. ఇప్పటికే వాంఖడేలో జరిగిన మ్యాచ్​లో ముంబయిని ఓడించింది దిల్లీ క్యాపిటల్స్​. ఇప్పుడు సొంతగడ్డపై మరోసారి రోహిత్​సేనను మట్టికరిపించాలని అనుకుంటోంది. గత మ్యాచ్​లో బెంగళూరుపై మ్యాచ్​ గెలిచింది ముంబయి. సొంతగడ్డపై దిల్లీతో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

దిల్లీ క్యాపిటల్స్​...

ఈ సీజన్​లో ఆడిన ఎనిమిది మ్యాచ్​ల్లో ఐదు గెలిచి రెండో స్థానంలో ఉంది దిల్లీ క్యాపిటల్స్​. రికీ పాంటింగ్, సౌరవ్​ గంగూలీ లాంటి దిగ్గజాల పర్యవేక్షణలో వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. గత మ్యాచ్​లో హైదరాబాద్​పై 155 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. రబాడ, మోరిస్ విజృంభించి రైజర్స్​ను 116 పరుగులకే కట్టడి చేశారు. ఆ మ్యాచ్​లో కీమో పాల్ మూడు వికెట్లు తీసి రైజర్స్ పతనాన్ని శాసించాడు.

  1. గత రెండు మ్యాచ్​ల్లో పాల్ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రబాడ, మోరిస్​, కిమో పాల్​తో దిల్లీ పేస్ విభాగం పటిష్ఠంగా ఉంది.
  2. బ్యాట్స్​మెన్​లలో పృథ్వీషా, శిఖర్ ధావన్, పంత్, ఇన్​గ్రామ్, శ్రేయాస్ అయ్యర్​లు మంచి ఫామ్​లో ఉన్నారు. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్​లో సమష్టిగా రాణించి విజయాన్ని కైవసం చేసుకోవాలనుకుంటోంది దిల్లీ.

ముంబయి ఇండియన్స్​...

ఓటములతో సీజన్​ను ప్రారంభించి తర్వాత వరుస విజయాలను అందుకుంటున్న జట్టు ముంబయి. గత మ్యాచ్​లో బెంగళూరుపై నాలుగు వికెట్లు తీసిన మలింగ తన పునరాగమాన్ని ఘనంగా చాటాడు. మలింక రాకతో రోహిత్​సేనకు అదనపు బలం చేకూరింది. జట్టులో సమర్థులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒకరు విఫలమైన మరొకరు రాణిస్తున్నారు.

  1. పంజాబ్​పై పొలార్డ్ అదరగొట్టగా... బెంగళూరుపై ఓటమి ఖాయామనుకున్న దశలో హార్ధిక్ పాండ్య 16 బంతుల్లో 37 పరుగులతో విజృంభించి ముంబయిని గెలిపించాడు.
  2. బ్యాటింగ్​, బౌలింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న రోహిత్​సేన.. ఫిరోజ్​ షా కోట్లలో ప్రభావం చూపాలనుకుంటోంది.

జట్ల అంచనా..

  • దిల్లీ క్యాపిటల్స్:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, పంత్, ధావన్, ఇషాంత్, రబాడ, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్, కీమో పాల్, ఇన్​గ్రామ్, రాహుల్ తేవాటియా

  • ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ, పొలార్డ్, బెహ్రాండార్ఫ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్, బుమ్రా, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, అల్జారీ జోసెఫ్, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1. ++TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Tennis Properties Ltd.
DURATION:
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.